News August 20, 2024

ప్రభాస్ స్థాయి చాలా పెద్దది: సుధీర్ బాబు

image

తెలుగు సినిమాను ప్రపంచస్థాయికి తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేసిన హీరో ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన<<13885603>> వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలకు టాలీవుడ్ నటీనటులు కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా హీరో సుధీర్ బాబు స్పందించారు. ‘నిర్మాణాత్మకంగా విమర్శించినా ఫర్వాలేదు. కానీ ఇలా తప్పుగా మాట్లాడొద్దు. వార్సీలో వృత్తి నైపుణ్యం లోపించింది. ప్రభాస్ స్థాయి చాలా పెద్దది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 19, 2024

CM రేవంత్‌కి రైతులంటే ఎందుకింత భయం: KTR

image

రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడాన్ని KTR ఖండించారు. రుణమాఫీ హామీ నిలబెట్టుకోవాలని రైతులు ‘చలో ప్రజాభవన్’కు పిలుపునిస్తే వారిని అరెస్ట్ చేస్తున్నారన్నారు. ‘ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఇకనైనా ఆపాలి. ముఖ్యమంత్రికి రైతులంటే ఎందుకింత భయం? ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదు’ అని ట్వీట్ చేశారు.

News September 19, 2024

సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లపై ప్రభుత్వం మరో నిర్ణయం

image

న్యూస్ పేపర్ కొనుగోలు కోసం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు ప్రతి నెలా ఇచ్చే రూ.200 భత్యాన్ని రద్దు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల ఏడాదికి రూ.102 కోట్ల నష్టం వాటిల్లిందని, దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని CM చంద్రబాబు సూచించారు. మరోవైపు ‘సాక్షి’ పేపర్ కొనుగోలుతో రెండేళ్లలో రూ.205 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఆరోపించారు.

News September 19, 2024

అన్‌ఫిట్ పేరుతో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు: సింగరేణి సీఎండీ

image

TG: సింగరేణిలో అన్‌ఫిట్ పేరుతో కొంతమంది అక్రమార్కులు అమాయకులైన కార్మికులను మోసం చేస్తున్నారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని CMD బలరాం తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థకు నష్టం కలిగించేలా పనులు చేసే వారి సమాచారాన్ని విజిలెన్స్ విభాగానికి 9491144104కు కాల్ లేదా సంస్థకు మెయిల్ చేసి చెప్పాలని సూచించారు. కచ్చితమైన సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల నజరానా ఇస్తామని ప్రకటించారు.