News June 20, 2024
ప్రభాస్.. యూనివర్సల్ డార్లింగ్!
ముంబైలో జరిగిన ‘కల్కి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను బిగ్ బీ అమితాబ్ ఆటపట్టించారు. డార్లింగ్ ఇంట్రోవర్ట్ అవడంతో అమితాబ్, కమల్, దీపిక, రానా ఏం అంటున్నా నవ్వుతూ సిగ్గుపడిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తమ ఫేవరేట్ హీరో ఇంత ఉల్లాసంగా ఉండటం చూసి చాలా రోజులవుతుందని, బాలీవుడ్ సైతం ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అయిందని ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు.
Similar News
News September 17, 2024
గణేశ్ నిమజ్జనోత్సవంలో పాల్గొననున్న CM
ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ప్రజాపాలన కార్యక్రమం ముగిసిన వెంటనే మరి కాసేపట్లో ఆయన ట్యాంక్‌బండ్‌కు చేరుకోనున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ సప్తముఖ వినాయకుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది.
News September 17, 2024
తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొన్న కిషన్ రెడ్డి, బండి
TG: కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. SECBAD పరేడ్ గ్రౌండ్‌లో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పాల్గొన్నారు. కిషన్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అమర జవాన్ల స్తూపానికి, వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళి అర్పించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం జరుగుతోంది. అసెంబ్లీ ప్రాంగణం వద్ద స్పీకర్ ప్రసాద్ జెండా ఆవిష్కరించారు.
News September 17, 2024
కొత్త రేషన్ కార్డుల అంశంపై ప్రజల్లో సందేహాలు
TG: రేషన్ కార్డులను విభజించి స్మార్ట్ రేషన్ కార్డులు, స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కార్డుల జారీకి లబ్ధిదారుల ఆదాయ పరిమితి, అర్హతలపై నిబంధనలను పున:సమీక్షిస్తామని చెప్పడంతో ప్రజల్లో సందేహాలు నెలకొన్నాయి. బియ్యం అవసరం లేని వారికి స్మార్ట్ హెల్త్ కార్డులు ఇస్తామని చెప్పడంపైనా అనుమానాలున్నాయి. ఈ నెల 21న ఈ అంశంపై తుది నిర్ణయం రానుంది.