News May 20, 2024
ప్రజ్వల్ భారత్‌కు వచ్చెయ్: కుమారస్వామి
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు రావాలని మాజీ సీఎం కుమారస్వామి కోరారు. సిట్ దర్యాప్తుకు సహకరించాలని.. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా మహిళలను లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణల నేపథ్యంలో గత నెల 26న ప్రజ్వల్ జర్మనీకి వెళ్లారు.
Similar News
News December 24, 2024
యశస్వీ జైస్వాల్ ఆ తప్పు చేస్తున్నారు: పుజారా
భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ క్రీజులో ఫాస్ట్‌గా ఆడాలని కంగారు పడుతున్నారని క్రికెటర్ పుజారా అభిప్రాయపడ్డారు. తొలి 15 పరుగులు వేగంగా చేయాలనుకుని తప్పు చేస్తున్నారని పేర్కొన్నారు. ‘టెస్టుల్లో వీరేంద్ర సెహ్వాగ్ వంటి దూకుడైన ఆటగాడు సైతం బంతి తన జోన్లో ఉన్నప్పుడే బలంగా బాదుతారు. కానీ జైస్వాల్ అనవసరమైన షాట్స్ ఆడుతున్నారు. బంతిని వద్దకు రానివ్వాలి. క్రీజులో ఎక్కువ సేపు నిలబడాలి’ అని సూచించారు.
News December 24, 2024
‘పుష్ప 2’ తొక్కిసలాట ఘటన.. ఏ-18గా మైత్రీ మూవీ మేకర్స్
‘పుష్ప 2’ ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు మైత్రీ మూవీ మేకర్స్‌ను ఏ-18గా చేర్చారు. ఇప్పటికే హీరో అల్లు అర్జున్ను ఏ-11గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్, సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌ఛార్జి, అల్లు అర్జున్ బౌన్సర్లను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో అల్లు అర్జున్‌తోపాటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
News December 24, 2024
ముగిసిన శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు
సినీ దర్శకుడు శ్యామ్ బెనగల్ అంత్యక్రియలు ముగిశాయి. ముంబైలోని శివాజీ పార్కులో రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు. ఆయన కుటుంబీకులు, సినీరంగ ప్రముఖులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక సెలవంటూ అశ్రునయనాలతో నివాళులర్పించారు. ఆయన రూపొందించిన కళాఖండాల్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. మూత్ర పిండాల సమస్యతో శ్యామ్ సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే.