News May 20, 2024

ప్రజ్వల్ భారత్‌కు వచ్చెయ్: కుమారస్వామి

image

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ నేత ప్రజ్వల్ రేవణ్ణ భారత్‌కు రావాలని మాజీ సీఎం కుమారస్వామి కోరారు. సిట్ దర్యాప్తుకు సహకరించాలని.. కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవాలని సూచించారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కాగా మహిళలను లైంగిక వేధింపులకు గురిచేశారనే ఆరోపణల నేపథ్యంలో గత నెల 26న ప్రజ్వల్ జర్మనీకి వెళ్లారు.

Similar News

News December 5, 2024

‘మేకిన్ ఇండియా’పై పుతిన్ ప్రశంసలు

image

చిన్న, మధ్యతరహా కంపెనీలకు స్థిరమైన పరిస్థితులను భారత ప్రభుత్వం, అక్కడి నాయకత్వం సృష్టించిందని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. PM నరేంద్రమోదీ చేపట్టిన ‘మేకిన్ ఇండియా’ బాగుందని ప్రశంసించారు. ‘రష్యా ఇంపోర్ట్ సబ్‌స్టిట్యూషన్ ప్రోగ్రామ్‌లాగే మేకిన్ ఇండియా ఉంటుంది. భారత్‌లో తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టుబడులు లాభయదాకమని మేం విశ్వసిస్తున్నాం’ అని అన్నారు.

News December 5, 2024

ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్‌జెండర్లు

image

TG: ట్రాఫిక్ అసిస్టెంట్లుగా 44 మంది ట్రాన్స్‌జెండర్లు ఎంపికయ్యారు. నిన్న హైదరాబాద్ గోషామహల్ మైదానంలో రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ లాంటి ఈవెంట్స్ నిర్వహించగా 58 మందిలో 44 మంది పాస్ అయ్యారు. వీరికి త్వరలో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. అనంతరం సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ మానిటరింగ్‌తో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ సేవలకు వినియోగించుకోనున్నారు. వీరికి ప్రత్యేక యూనిఫామ్, స్టైఫండ్ అందిస్తారు.

News December 5, 2024

ఇకపై ప్రతినెలా రెండుసార్లు క్యాబినెట్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశాలను ఇకపై నెలకు రెండుసార్లు(మొదటి, మూడో గురువారం) నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు CS నీరభ్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. గురువారం ప్రభుత్వ సెలవు ఉంటే శుక్రవారం భేటీ జరగనుంది. సమావేశాలకు 3 రోజుల ముందుగానే అన్ని శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలను సాధారణ పరిపాలన శాఖకు పంపాలని CS సూచించారు. కాగా ఈ నెల 19న రెండో మంత్రివర్గ సమావేశం జరగనుంది.