News July 3, 2024
త్వరలో ప్రసారభారతి ఓటీటీ.. ప్రైవేట్ కంపెనీల్లో ఆందోళన?
కేంద్రానికి చెందిన ప్రసారభారతి సొంత ఓటీటీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వేళ ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఓటీటీలో స్పోర్ట్స్ ఫ్రీగా లైవ్ ప్రసారం చేస్తే తాము భారీగా నష్టపోతామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే స్పోర్ట్స్ ప్రసారంపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా వార్తలు, వినోదం, క్రీడలు మొదలైన విభాగాలపై ప్రసారభారతి ఓటీటీని తీసుకురానున్నట్లు సమాచారం.
Similar News
News October 8, 2024
రేపు బిగ్ అనౌన్స్‌మెంట్.. వెయిట్ చేయండి: లోకేశ్
AP: రేపు బిగ్ అనౌన్స్‌మెంట్ ఉండబోతోందంటూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. టాటా సన్స్, టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆయనతో సమావేశం ఫలప్రదంగా సాగిందని తెలిపారు. రేపటి ప్రకటన కోసం ఎదురుచూస్తూ ఉండాలని కోరారు. మరి ఏపీలో టాటా గ్రూప్ భారీ పెట్టుబడి పెడుతుందేమో చూడాలి.
News October 8, 2024
జమ్మూ-కశ్మీర్ ప్రజల భిన్నమైన తీర్పు
NDA నిర్ణయాలపై జమ్మూ, కశ్మీర్ ప్రజలు భిన్నంగా స్పందించినట్టు ఫలితాల సరళి స్పష్టం చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా విభజించడం, LGకి అపరిమిత అధికారాలపై కశ్మీర్ వ్యాలీ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జమ్మూలో మాత్రం BJP మెజారిటీ సీట్లు సాధించడం గమనార్హం. ఆ స్థాయిలో కశ్మీర్‌లో పోటీ చేసిన కొన్ని స్థానాల్లో BJP ఆశించిన ఫలితాల్ని రాబట్టలేకపోయింది.
News October 8, 2024
కులగణనపై 2, 3 రోజుల్లో కీలక నిర్ణయం: మంత్రి పొన్నం
TG: కులగణనపై 2, 3 రోజుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు. కుల గణన ప్రక్రియను నెల రోజుల్లోనే పూర్తి చేయనున్నామని తెలిపారు. రిపోర్ట్ పారదర్శకంగా ఉండడానికి జీఏడీ లేదా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల్లో దేని ద్వారా కులగణన సర్వే చేయించాలనే దానిపై 2 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.