News September 26, 2024
ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కౌంటర్
TG: రేపు ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు.
Similar News
News October 9, 2024
‘అన్‌స్టాపబుల్’ షోలో బాలయ్యతో అల్లు అర్జున్!
నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాల్గొన్నట్లు సినీవర్గాలు తెలిపాయి. వీరిద్దరి కాంబోలో ‘పుష్ప’ రిలీజ్ సమయంలో ఓ ఎపిసోడ్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఆయన పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది ‘పుష్ప-2’ రిలీజ్‌కు ముందు విడుదలయ్యే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే ప్రకటన రానున్నట్లు సమాచారం.
News October 9, 2024
GOOD NEWS: ఫోర్టిఫైడ్ రైస్ సప్లై గడువు పెంపు
విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్‌ను 2028 వరకు ఇవ్వాలని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. PMGKAY, ఇతర వెల్ఫేర్ స్కీంల కింద వీటిని సరఫరా చేసేందుకు ఆమోదించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు రూ.17,082 కోట్లకు కేంద్రమే భరించనుంది. 2019-21 మధ్య చేసిన హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే.
News October 9, 2024
అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM
AP: పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.