News August 6, 2024

గోల్డ్ మెడల్ రావాలంటే ప్రార్థనలే సరిపోవు: హర్ష

image

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా పారిస్ ఒలింపిక్స్‌పై ఫన్నీ ట్వీట్ చేశారు. జావెలిన్ త్రోలో నీరజ్ ఫైనల్ దూసుకెళ్లడాన్ని ఉద్దేశిస్తూ మనకు గోల్డ్ రావాలంటే ప్రార్థనలు మాత్రమే సరిపోవు అంటూ పైనున్న ఫొటో షేర్ చేశారు. అందులో నీరజ్‌కు దిష్టి తగలకుండా దిష్టి చుక్కలు పెట్టినట్లు ఎడిట్ చేశారు. నిమ్మకాయ, పచ్చిమిర్చి వేలాడదీసినట్లు ఫొటోలో ఉంది. <<-se>>#Olympics2024<<>>

Similar News

News September 14, 2024

ఆధార్ FREE అప్డేట్ తేదీ పొడిగింపు

image

ఆధార్ కార్డు వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువును డిసెంబర్ 14 వరకు పొడిగిస్తున్నట్లు UIDAI కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించింది. పదేళ్లకు పైగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోని వారు, తమ డేటా వివరాల కచ్చితత్వాన్ని మెరుగుపరిచేందుకు సంబంధిత ఆధారాలను సమర్పించాలి. అడ్రస్, చిరునామా, పేరు, పుట్టిన తేదీ వంటివి సులభంగా మార్చుకోవచ్చు. అప్‌డేట్ చేసేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 14, 2024

సూర్యా.. భారత్‌కు మరెన్నో విజయాలు అందించు: జై షా

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ బర్త్ డే సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి జై షా ఆయనకు ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ‘భారత టీ20ఐ కెప్టెన్, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్‌కు హ్యాపీ బర్త్ డే. పొట్టి ఫార్మాట్‌లో మన జట్టుకు మీరు మరెన్నో విజయాలకు సాధించిపెట్టాలి. బెస్ట్ విషెస్ ఫర్ ది ఇయర్ ఎహెడ్’ అని ట్వీట్ చేశారు. ఈరోజు సూర్య తన 34వ పుట్టినరోజును జరుపుకొంటున్నారు.

News September 14, 2024

ట్రంప్, కమల ఇద్దరూ చెడ్డవాళ్లే: పోప్

image

అమెరికా అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్‌పై పోప్ ఫ్రాన్సిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జీవనానికి వ్యతిరేకులేనని పేర్కొన్నారు. ‘ట్రంప్ వలసలకు వ్యతిరేకి. కమల అబార్షన్‌కు మద్దతునిస్తున్నారు. నేను అమెరికన్ కాదు. నాకు అక్కడ ఓటు లేదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. వారిద్దరూ చేసేది పాపమే. అమెరికన్లు ఆ ఇద్దరిలో తక్కువ చెడ్డ వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు.