News July 31, 2024

ఆ పాత్రలకే ప్రాధాన్యమిస్తా: జాన్వీ కపూర్

image

తన జీవితమంతా నటనకే అంకితమని హీరోయిన్ జాన్వీకపూర్ అన్నారు. తొలి సినిమా నుంచి ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. తాను రిస్క్‌తో కూడిన పాత్రలను ఎంచుకోవడానికి ఇష్టపడుతానన్నారు. అందులో తన నటన చూసి ఆశ్చర్యపోవాలని అనుకుంటానని చెప్పారు. ప్రతి సినిమాలో దర్శకుడు కోరుకునేది 100శాతం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.

Similar News

News January 20, 2026

లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

image

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.

News January 20, 2026

రాష్ట్రంలో 859 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ డిస్ట్రిక్ కోర్టుల్లో 859 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల వారు JAN 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్, టైపిస్ట్, Jr. అసిస్టెంట్, ఎగ్జామినర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, టెన్త్, ఏడో తరగతి ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 నుంచి 46ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://tshc.gov.in

News January 20, 2026

గ్రీన్‌లాండ్ టెన్షన్‌.. కుదేలైన స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలు చవిచూశాయి. ఒక్క రోజులోనే రూ.9 లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. నిఫ్టీ 353 పాయింట్లకుపైగా పడిపోయి 25,232 వద్ద ముగియగా, సెన్సెక్స్ 1065 పాయింట్లకు పైగా నష్టపోయి 3 నెలల కనిష్ఠమైన 82,180కి చేరింది. గ్రీన్‌లాండ్‌పై US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు, టారిఫ్‌ల బెదిరింపులతో ఇన్వెస్టర్లు ఆందోళనకు గురయ్యారు. దీంతో అన్ని రంగాలు నష్టాల్లోనే ట్రేడయ్యాయి.