News January 25, 2025

గ్యాలంటరీ అవార్డులు ప్రకటించిన రాష్ట్రపతి

image

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సాయుధ బలగాల్లో 93 మందికి గ్యాలంటరీ పురస్కారాలు ప్రకటించారు. 11 మందిని మరణానంతరం గ్యాలంటరీ అవార్డులకు ఎంపిక చేశారు. ఇద్దరికి కీర్తి చక్ర, 14 మందికి శౌర్యచక్ర, 66 మందికి సేనా మెడల్స్ ప్రకటించారు.

Similar News

News December 4, 2025

టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

image

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.

News December 4, 2025

‘అఖండ-2’ మూవీ.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్

image

అఖండ2 ప్రీమియర్స్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్న బాలయ్య ఫ్యాన్స్‌కు డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ షాకిచ్చింది. సాంకేతిక కారణాలతో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియాలో ప్రీమియర్స్ ఉండవని 14 రీల్స్ ప్లస్ సంస్థ ప్రకటించింది. ఓవర్సీస్‌లో మాత్రం యథావిధిగా ప్రీమియర్స్ ఉంటాయంది. ఇవాళ రాత్రి గం.8 నుంచి షోలు మొదలవుతాయని ప్రకటన వచ్చినా టికెట్స్‌పై సమాచారం లేక ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News December 4, 2025

పొరపాటున కూడా వీటిని ఫ్రిజ్‌లో పెట్టకండి!

image

అధిక కాలం తాజాగా ఉంచడానికి చాలామంది ప్రతీ వస్తువును ఫ్రిజ్‌లో పెడుతుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిజ్‌లో పెట్టకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పొరపాటున కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని ఆహారాలు.. డ్రై ఫ్రూట్స్, సుగంధ ద్రవ్యాలు, కాఫీ, నూనెలు, కుంకుమ పువ్వు, బ్రెడ్, క్యారెట్, అల్లం, ముల్లంగి, బంగాళదుంపలు. ఒకవేళ తప్పకుండా ఫ్రిజ్‌లోనే పెట్టాలి అనుకుంటే గాజు జార్‌లో ఉంచడం బెస్ట్.