News January 9, 2025
తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తిరుపతిలో టికెట్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణాలు చోటు చేసుకోవడం బాధించినట్లు ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఈ ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారు.
Similar News
News November 9, 2025
అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది: శశిథరూర్

BJP నేత అద్వానీపై కాంగ్రెస్ MP శశిథరూర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘ఒక్క ఘటనను కారణంగా చూపించి ఆయన చేసిన సుదీర్ఘ సేవను తగ్గించడం అన్యాయం. చైనా ఎదురుదెబ్బను చూపించి నెహ్రూ కెరీర్‌ను, ఎమర్జెన్సీ ఆధారంగా ఇందిరా గాంధీ రాజకీయ జీవితాన్ని నిర్వచించలేం. అద్వానీకీ అదే న్యాయం వర్తిస్తుంది’ అని తెలిపారు. విద్వేషపు విత్తనాలు నాటడం సేవ కాదని అద్వానీపై అడ్వకేట్ సంజయ్ హెగ్డే చేసిన ట్వీట్‌కు ఇలా బదులిచ్చారు.
News November 9, 2025
నైట్ పార్టీల్లో ఇలా మెరిసిపోండి

పార్టీల్లో అందంగా కనిపించాలంటే మేకప్ తప్పనిసరి. అయితే నైట్ పార్టీల్లో న్యూడ్ కలర్స్ కంటే ముదురురంగు లిప్‌స్టిక్ బావుంటుంది. ప్లెయిన్ ఐ షాడోకి గ్లిట్టర్ యాడ్ చెయ్యాలి. కాంపాక్ట్ పౌడర్ లైట్‌గా అద్దుకోవాలి. బ్రాంజర్‌తో కాంటూర్, చెక్కిళ్లకు బ్లషర్ అద్దాలి. ఫాల్స్ ఐ లాషెస్ లేదా డ్రమాటిక్ మస్కారా యాడ్ చెయ్యాలి. హైలైటర్‌ను చెక్కిళ్లు, బ్రో బోన్ మీద అద్దుకుంటే పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మీరే అవుతారు.
News November 9, 2025
CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి కొండపల్లి

AP: రాష్ట్రాన్ని మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలో MSME ఎగుమతుల అభివృద్ధి సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘IT రంగంలోనూ విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోంది. MSME విభాగంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలుస్తోంది. CII సదస్సులో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఏపీపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది’ అని పేర్కొన్నారు.


