News February 10, 2025
రేపు మహా కుంభమేళాకు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రేపు మహాకుంభమేళాకు వెళ్లనున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం ఆచరించనున్నారు. అనంతరం స్థానిక ఆలయంలో పూజలు చేస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ప్రయాగ్ రాజ్‌లో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
Similar News
News March 28, 2025
IPL టికెట్ రూ.2343, పన్నులు రూ.1657!

IPL టికెట్ల ద్వారా మన ప్రభుత్వాలు క్రికెట్ అభిమానులను దోచేస్తున్నాయని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ ఆలోచింపజేస్తోంది. చెన్నైలో బేసిక్ టికెట్ ధర రూ.2343 ఉండగా ఎంటర్‌టైన్‌మెంట్ ట్యాక్స్ (25%) రూ.781 వేశారు. ఆ మొత్తంపై మళ్లీ 28 శాతం జీఎస్టీ వడ్డించారు. ఇందులో కేంద్రానికి 14 శాతం, రాష్ట్రానికి 14 శాతం వెళ్తుంది. రూ.4000లలో పన్నుల రూపంలోనే రూ.1657 తీసుకుంటున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 28, 2025
కొలికపూడి వ్యవహారంపై నివేదిక కోరిన టీడీపీ

AP: ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుపై TDP అధిష్ఠానం ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందరినీ కలుపుకుని వెళ్లాలని చెప్పినా ఆయనలో మార్పురాలేదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై నివేదిక ఇవ్వాలని జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త, ఎంపీని ఆదేశించింది. తాజాగా టీడీపీ నేత రమేశ్ రెడ్డిపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తానని కొలికపూడి <<15904325>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.
News March 28, 2025
రూ.వేల కోట్లలో నల్లధనం బయటపడింది: మోదీ

2047 సంవత్సరంలో దేశం వికసిత్ భారత్‌గా ఎదిగిన నాడు అధికంగా లాభపడేది యువతేనని ప్రధాని మోదీ తెలిపారు. ‘వాట్ ఇండియా థింక్స్ టుడే’ అనే సదస్సులో మోదీ మాట్లాడారు. ED దాడులతో రూ.22,000 కోట్ల నల్లధనం బయటపడిందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యంలో సవాళ్లు అధిగమించేందుకు IMAC ఏర్పాటవుతుందని, ఇది ఏషియా, యూరప్, మిడిల్ ఈస్ట్‌ను కలుపుతుందన్నారు. విపత్తుల సమయంలో దేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.