News July 5, 2024
అమరావతికి రానున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

AP: దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తైతే 5వేల మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించొచ్చు.
Similar News
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.
News November 27, 2025
RED ALERT: ఈ జిల్లాలకు భారీ వర్షసూచన

AP: నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారిందని APSDMA వెల్లడించింది. దీనికి ‘దిట్వా’గా పేరు పెట్టారు. దీని ప్రభావంతో శని, ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఆదివారం CTR, TPT, NLR, ప్రకాశం, కడప, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది.
News November 27, 2025
శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.


