News July 5, 2024
అమరావతికి రానున్న ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ

AP: దేశంలోనే ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ఒకటైన XLRI అమరావతిలో తమ క్యాంపస్ నెలకొల్పనుంది. ఈ సంస్థకు గతంలో 50 ఎకరాలను చంద్రబాబు కేటాయించారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంస్థ వెనక్కి తగ్గింది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మళ్లీ సంప్రదింపులు జరపడంతో రూ.250 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. నిర్మాణం పూర్తైతే 5వేల మంది రాష్ట్ర, దేశ, విదేశీ విద్యార్థులు UG, PG కోర్సుల్లో విద్యను అభ్యసించొచ్చు.
Similar News
News December 9, 2025
చైనాకు వెళ్తుంటే జాగ్రత్త!

భారతీయులు చైనాకు వెళ్తున్నా, ఆ దేశం మీదుగా ప్రయాణిస్తున్నా జాగ్రత్తలు తీసుకోవాలని విదేశాంగశాఖ సూచించింది. ఇటీవల షాంఘై ఎయిర్‌పోర్టులో AR.P మహిళను <<18509379>>నిర్బంధించిన<<>> నేపథ్యంలో హెచ్చరించింది. భారతీయులను లక్ష్యంగా చేసుకోబోమని చైనా హామీ ఇస్తుందని ఆశిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తెలిపారు. నిర్బంధించడం మానుకొని విమాన ప్రయాణ నిబంధనలు గౌరవిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.
News December 9, 2025
షాంఘైలో మహిళ నిర్బంధం.. ఏం జరిగింది?

పెమా వాంగ్ అనే మహిళ గత నెల లండన్ నుంచి జపాన్ వెళ్తుండగా తన ఫ్లైట్ ట్రాన్సిట్ హాల్ట్ కోసం షాంఘైలో ఆగింది. అయితే ఎయిర్‌పోర్ట్ అధికారులు తన పాస్‌పోర్టులో అరుణాచల్ ప్రదేశ్ అని ఉండటంతో అది చెల్లదని 18గంటలు నిర్బంధించారని ఆమె ఆరోపించారు. ఆపై IND ఎంబసీని సంప్రదిస్తే సాయం అందినట్లు చెప్పారు. దీనిపై భారత్ స్పందిస్తూ.. AR.P ఎప్పటికీ INDలో భాగమే అని, అక్కడి ప్రజలు భారత్ పాస్‌పోర్ట్ కలిగి ఉంటారని చెప్పింది.
News December 9, 2025
డిసెంబర్ 9: చరిత్రలో ఈ రోజు

1946: ఏఐసీసీ అగ్ర నేత సోనియా గాంధీ జననం
1970: టాలీవుడ్ డైరెక్టర్ వి.సముద్ర జననం
1975: హీరోయిన్ ప్రియా గిల్ జననం
1981: హీరోయిన్ కీర్తి చావ్లా జననం
2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటన
– అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం


