News October 1, 2024
డిస్కౌంట్స్‌కు ముందు ధరల పెంపు.. రంగంలోకి AUS ప్రధాని

భారీ డిస్కౌంట్ల పేరుతో చేస్తోన్న స్కామ్‌ను నివారించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. అక్కడి సూపర్ మార్కెట్స్ డిస్కౌంట్స్ ఇచ్చేముందు ప్రొడక్ట్ లేబుల్స్‌ను మార్చేస్తున్నాయని వాచ్డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంథోనీ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డోయల్‌తో పాటు మరికొందరితో చర్చించినట్లు ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తక్కువ ధరకు వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.
Similar News
News November 16, 2025
విజయనగరం జిల్లాలో జాబ్ మేళా

AP:విజయనగరం జిల్లాలోని మహారాజ్ కాలేజీలో జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్ మేళా నిర్వహించనున్నారు. టెన్త్, ITI, డిగ్రీ, పీజీ, ANM, GNM, BSc, MSc (నర్సింగ్), ఫార్మసీ ఉత్తీర్ణులై, 18- 45ఏళ్ల లోపు వారు అర్హులు. 280 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంప్లాయిమెంట్ ఎక్ఛేంజ్ కార్డ్ తప్పనిసరి. అభ్యర్థులు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: employment.ap.gov.in
News November 16, 2025
కష్టాల్లో టీమ్ ఇండియా.. 75కే 6 వికెట్లు

సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్సులో టీమ్ ఇండియా కష్టాల్లో పడింది. 124 పరుగుల లక్ష్యఛేదనలో 74 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. మంచి భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్ (31), జడేజా (16) ఔటయ్యారు. ప్రస్తుతం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 49 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News November 16, 2025
USలో మండుతున్న ధరలు.. సుంకాలు తగ్గించిన ట్రంప్

భారత్‌పై అదనపు సుంకాలు వేయడంతో అమెరికాలో పలు ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. దాదాపు 200 ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించారు. ఇందులో భారత్ ఎగుమతి చేసే టీ, మిరియాలు, జీలకర్ర, యాలకులు, పసుపు, అల్లం, జీడిపప్పు, మామిడి వంటి ఉత్పత్తులు ఉన్నాయి. ఈ సడలింపు భారత వ్యవసాయ ఎగుమతులకు పెద్ద ఊతమిస్తుంది. సీ ఫుడ్, బాస్మతి రైస్‌పై తగ్గించలేదు.


