News April 5, 2024
అత్యవసర మందుల ధరలు పెరగవు: కేంద్రమంత్రి

అత్యవసర ఔషధాల ధరలు పెరగనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కొట్టిపారేశారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో పెరుగుదల లేనందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఔషధాల ధరలు పెరగవని చెప్పారు. టోకు ధరల ఆధారంగానే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏటా రేట్లను సవరిస్తుంటుందని తెలిపారు.
Similar News
News December 3, 2025
చెలరేగిన బ్యాటర్లు.. భారత్ భారీ స్కోర్

సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారత్ 358/5 రన్స్ చేసింది. ఓపెనర్లు రోహిత్(14), జైస్వాల్(22) నిరాశపరచగా.. రుతురాజ్(105) వన్డేల్లో తొలి సెంచరీ బాదారు. కోహ్లీ(102) వరుసగా రెండో వన్డేలోనూ శతకం నమోదు చేశారు. రాహుల్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి, వరుసగా రెండో అర్ధసెంచరీ(66*) చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో జాన్సెన్ 2, బర్గర్, ఎంగిడి తలో వికెట్ తీశారు.
News December 3, 2025
రేవంత్ క్షమాపణలు చెప్పాలి: కిషన్ రెడ్డి

TG: హిందూ దేవుళ్లను సీఎం రేవంత్ అవమానించేలా మాట్లాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. CM రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి భూములు అమ్మకపోతే పూట గడవని పరిస్థితి ఉందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం చేకూర్చేందుకు సీఎం రేవంత్ హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని ఆరోపించారు.
News December 3, 2025
లింగ భైరవి దేవత గురించి మీకు తెలుసా?

ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శక్తివంతమైన దేవీ స్వరూపమే ‘లింగ భైరవి’. తాంత్రిక యోగంలో అత్యంత శక్తిమంతమైన ‘భైరవి’ రూపమే లింగాకారంలో ఉండటం వలన దీనిని లింగభైరవి అని పిలుస్తారు. కోయంబత్తూరులో ఈ ఆలయం ఉంది. భక్తులు తమ జీవితంలో భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సమతుల్యత, ఆరోగ్యం, వ్యాపారం కోసం ఈ అమ్మవారిని పూజిస్తారు. భైరవి సాధనతో భావోద్వేగ బుద్ధిని పెరుగుతుందని నమ్మకం.


