News January 4, 2025
8న విశాఖకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

AP: ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆ రోజున సా.4.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ గంటసేపు PM సభ కొనసాగనుంది. విశాఖ రైల్వే జోన్, NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రా.7 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.
Similar News
News February 27, 2026
చిన్నారితో వెకిలి పనులు.. దొంగ బాబాపై పోక్సో కేసు!

ఏడేళ్ల చిన్నారిని అసభ్యంగా తాకుతూ, వెకిలి చేష్టలు చేశాడో దొంగ బాబా. యాద్గిర్(KA) జిల్లాలోని మహల్ రోజా మఠంలో మల్లికార్జున ముత్య(26) బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వీడియో వైరల్ అయింది. దీంతో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. రాష్ట్ర బాలల హక్కుల రక్షణ కమిషన్ సుమోటోగా తీసుకొని జిల్లా ఎస్పీకి లేఖ రాసింది. అయితే ఆమెను కుమార్తెలా చూసుకున్నానని, ఈ కేసుపై చట్టబద్ధంగా పోరాడతానని ముత్య చెప్పాడు.
News February 27, 2026
భారత్ ఘన విజయం

T20WC: జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. 257 పరుగుల లక్ష్య ఛేదనలో ZIM బ్యాటర్లు 184-6 రన్స్‌కే పరిమితమయ్యారు. బెనెట్(97*) ఒంటరి పోరాటం చేశారు. కెప్టెన్ రజా(31) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3, వరుణ్, అక్షర్, దూబే తలో వికెట్ తీశారు. మార్చి 1న వెస్టిండీస్‌తో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది.
News February 26, 2026
కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలి: కేంద్ర మంత్రి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తమ ఆదాయంలో కంటెంట్ క్రియేటర్లకు న్యాయమైన వాటా ఇవ్వాలని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టంచేశారు. ప్రొఫెషనల్ జర్నలిస్టుల నుంచి మారుమూల ప్రాంతాల క్రియేటర్ల వరకు అందరికీ దీన్ని వర్తింపజేయాలని సూచించారు. డీప్ ఫేక్ వీడియోలు పెరిగిపోతున్నాయని, పబ్లిష్ అయ్యే ప్రతీ కంటెంట్‌కూ ఆయా ప్లాట్‌ఫామ్స్ బాధ్యత వహించాలని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ కాంక్లేవ్‌లో అన్నారు.


