News January 4, 2025

8న విశాఖకు ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఇదే

image

AP: ప్రధాని మోదీ ఈ నెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆ రోజున సా.4.15 గంటలకు నగరానికి చేరుకుంటారు. సిరిపురం కూడలి నుంచి AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. అక్కడ గంటసేపు PM సభ కొనసాగనుంది. విశాఖ రైల్వే జోన్, NTPC ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్, కృష్ణపట్నం ఇండస్ట్రీయల్ హబ్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ పనులకు శంకుస్థాపన చేస్తారు. రా.7 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరుతారు.

Similar News

News January 24, 2025

VIRAL: విపరీతమైన చలి.. ఏనుగులకు స్వెటర్లు

image

చలి విపరీతంగా పెరిగిపోవడంతో బయటకు వెళ్లాలంటేనే ప్రజలు జంకుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పొగ మంచు కప్పేస్తోంది. దీంతో మూగ జీవాలు సైతం వణికిపోతున్నాయి. ఈక్రమంలో ప్రతి ఏటా మథురలోని వైల్డ్‌లైఫ్ రెస్క్యూ & రిహాబిలిటేషన్ ఆర్గనైజేషన్ రెస్క్యూ చేసిన ఏనుగులకు స్వెటర్లు వేస్తుంటుంది. బ్లాంకెట్స్ & మహిళలు నేసిన ఊలు స్వెటర్లు ధరించడంతో ఏనుగులు ఎంతో అందంగా కనిపిస్తుంటాయి.

News January 24, 2025

ముగిసిన గ్రామ సభలు.. నెక్స్ట్ ఏంటి?

image

TG: ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల లబ్ధిదారుల కోసం నిర్వహించిన గ్రామ సభలు ముగిశాయి. అధికారులు ఎంపికైన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వే చేసి వారి ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటారు. లబ్ధిదారులపై ఎవరైనా అభ్యంతరాలు తెలిపితే ఎంక్వైరీ చేస్తారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

News January 24, 2025

బీఆర్ఎస్ పార్టీకి షాక్

image

TG: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నగర మేయర్ సునీల్ రావు సహా 10 మంది కార్పొరేటర్లు ఆ పార్టీని వీడనున్నారు. రేపు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు.