News May 4, 2024

14న ప్రధాని మోదీ నామినేషన్

image

వారణాసి లోక్‌సభ స్థానానికి ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న ఆయన.. 13వ తేదీన స్థానికంగా భారీ రోడ్‌షో నిర్వహించనున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వారణాసి నుంచి గెలిచిన మోదీ.. మూడోసారి ఇక్కడే బరిలోకి దిగుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అజయ్ రాయ్ బరిలో నిలుస్తున్నారు.

Similar News

News April 4, 2026

డిఫెన్స్ బడ్జెట్‌ను 40% పెంచిన అమెరికా!

image

అమెరికా తన డిఫెన్స్ బడ్జెట్ భారీగా పెంచింది. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి 1.5 ట్రిలియన్ డాలర్ల (₹139లక్షల కోట్లు) బడ్జెట్‌కు ఆమోదం తెలపాలని అమెరికా అధ్యక్షుడు US కాంగ్రెస్‌‌లో ప్రతిపాదించారు. ఇరాన్‌తో యుద్ధం సహా గ్లోబల్‌గా అమెరికా మిలిటరీ అవసరాలు పెరగడంతో ఆ భారం డిఫెన్స్ బడ్జెట్‌పై పడింది. దీనిని ఆమోదిస్తే బడ్జెట్ 40% పెరుగుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ స్థాయి హైక్ ఇదే తొలిసారి.

News April 4, 2026

ఏప్రిల్ 4: చరిత్రలో ఈరోజు

image

1905: హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రాలో సంభవించిన భూకంపంలో 20,000 మంది మృతి
1942: తెలుగు రచయిత్రి చల్లా సత్యవాణి జననం
1968: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మరణం (ఫొటోలో)
1975: మైక్రోసాఫ్ట్ సంస్థ స్థాపించిన రోజు
1979: సినీ నటి సిమ్రాన్ జననం
* గనుల అవగాహన దినోత్సవం
* జాతీయ విటమిన్ ‘సి’ దినోత్సవం

News April 4, 2026

చెపాక్ చెదిరింది.. కంచుకోట చెన్నైకా? ప్రత్యర్థులకా?

image

IPL: ఒకప్పుడు CSK కంచుకోట అయిన చెపాక్ స్టేడియం ఇప్పుడు ఆ జట్టుకు శాపంగా మారింది. హోంగ్రౌండ్‌లో చెన్నై ఓడిపోవడం ఇది వరుసగా ఆరోసారి. చివరగా 2025 మార్చి 23న ఇక్కడ గెలిచింది. ఇక పంజాబ్ ఇక్కడ వరుసగా నాలుగుసార్లు గెలిచి ముంబై (5) తర్వాత అత్యధిక సార్లు చెన్నైని చెపాక్‌లో ఓడించిన జట్టుగా నిలిచింది. CSKతో ఆడిన లాస్ట్ తొమ్మిది మ్యాచ్‌లలో 8 సార్లు గెలిచిన PBKS హెడ్ టు హెడ్‌లో 17 విజయాలతో పైచేయి సాధించింది.