News May 10, 2024
తెలుగులో ప్రధాని మోదీ ప్రసంగం

‘హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం’ అంటూ HYD LB స్టేడియంలో ప్రధాని మోదీ తొలుత తెలుగులో ప్రసంగించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామంటోంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. జూన్ 4న దేశం గెలుస్తుంది. శత్రువులు ఓడిపోతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News November 7, 2025
నువ్వులతో ఎన్నో లాభాలు

నువ్వుల్లో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. హైబీపీ, హై కొలెస్ట్రాల్, షుగర్ లెవల్స్ తగ్గించడంలో కీలకంగా ఉంటాయి. అలాగే ఎముకల దృఢత్వాన్ని పెంచడంలోనూ నువ్వులు సహాయం చేస్తాయి. వీటిని రోజూ తింటుంటే శరీర మెటబాలిజం, రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
News November 7, 2025
APPLY NOW: NIEPMDలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ మల్టిపుల్ డిజాబిలిటీస్ (NIEPMD)లో 7 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ఫిజియోథెరపిస్ట్, నర్స్ తదితర పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.590. SC, ST, మహిళలు, PWBDకు ఫీజు నుంచి మినహాయింపు కలదు. BOT, PG డిప్లొమా, BPT, Bsc నర్సింగ్, ఇంటర్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://<
News November 7, 2025
బిడ్డకు జన్మనిచ్చిన కత్రినా కైఫ్

బాలీవుడ్ స్టార్ కపుల్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పేరెంట్స్ అయ్యారు. కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. నవంబర్ 7న మగబిడ్డ జన్మించాడని విక్కీ కౌశల్ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీరికి 2021లో వివాహమైంది.


