News May 10, 2024
తెలుగులో ప్రధాని మోదీ ప్రసంగం

‘హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం’ అంటూ HYD LB స్టేడియంలో ప్రధాని మోదీ తొలుత తెలుగులో ప్రసంగించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామంటోంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. జూన్ 4న దేశం గెలుస్తుంది. శత్రువులు ఓడిపోతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.
Similar News
News February 18, 2025
KG టు PG విద్యలో సమూల మార్పులు: మంత్రి లోకేశ్

AP: కేజీ టు పీజీ విద్యలో సమూల మార్పులు తెస్తున్నామని, రాష్ట్ర విద్యారంగాన్ని దేశంలోనే నంబర్-1 చేయడమే లక్ష్యమని మంత్రి లోకేశ్ చెప్పారు. మూస పద్ధతులకు స్వస్తి పలికి కరిక్యులమ్ ఛేంజ్ చేస్తున్నామన్నారు. కాలేజీల నుంచి బయటకు రాగానే విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేలా నైపుణ్యాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ మేరకు సులోచనాదేవి సింఘానియా స్కూల్ ట్రస్టుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.
News February 18, 2025
రేపు ఢిల్లీ సీఎం ఎంపిక, ఎల్లుండి ప్రమాణం

ఢిల్లీ సీఎం ప్రమాణస్వీకారంలో బీజేపీ స్వల్ప మార్పులు చేసింది. ఈ నెల 20న సా.4.30 గం.కు కాకుండా ఉ.11.30 గం.కు రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. రేపు మ.3.30 గం.కు బీజేపీ శాసనసభాపక్షం సమావేశమై సీఎం పేరును ఖరారు చేయనుంది. రేసులో పర్వేశ్ వర్మ, విజేందర్ గుప్తా, సతీశ్ ఉపాధ్యాయ్ తదితరులు ఉన్నారు.
News February 18, 2025
చేతుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ పంప్, షాంపైన్ గ్లాస్.. హీరోయిన్‌పై విమర్శలు

హీరోయిన్ రాధికా ఆప్టే గతేడాది DECలో బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. 2నెలల అనంతరం తాజాగా ఆమె బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో మెరిశారు. ఈ సందర్భంగా ఓ చేతిలో బ్రెస్ట్ మిల్క్ పంపింగ్, మరో చేతిలో షాంపైన్ గ్లాస్ పట్టుకొని ఫొటో దిగారు. దీన్ని ఇన్‌స్టాలో షేర్ చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. బిడ్డకు పాలిచ్చే సమయంలో ఆల్కాహాల్ తాగడం సరికాదని, చిన్నారి ఆరోగ్యానికి ప్రమాదమని కామెంట్స్ చేస్తున్నారు.