News January 2, 2025
8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన

AP: ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈనెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్, 8న PM సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Similar News
News November 21, 2025
Hello Day: ఇవాళ్టి స్పెషాలిటీ ఇదే..

ఎదుటివారితో మన సాధారణ పలకరింపులు, ఫోన్ కన్వర్జేషన్లు Helloతోనే మొదలవుతాయి. ఇంత ప్రాధాన్యమున్న ‘హలో’నూ సెలబ్రేట్ చేసుకోవడానికి ఓ డే ఉంది. అది ఈ రోజే(NOV21). 1973లో ఈజిప్ట్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని రూపొందించారు. ప్రపంచ నాయకులు సంఘర్షణలను కమ్యూనికేషన్తో పరిష్కరించుకోవాలనేది దీని ఉద్దేశం. ప్రజలు కూడా కనీసం 10 మందికి శుభాకాంక్షలు చెప్పి ఈ రోజును సెలబ్రేట్ చేసుకోవచ్చు.
News November 21, 2025
DRDO-DIPRలో JRF పోస్టులు

DRDO-డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్(<
News November 21, 2025
ఐబొమ్మ రవిపై మరో 3 సెక్షన్లు.. నేడు రెండో రోజు కస్టడీ విచారణ

iBOMMA రవిపై పోలీసులు మరో 3 సెక్షన్లు నమోదు చేశారు. ఇప్పటికే అతడిపై IT యాక్ట్, BNS సెక్షన్లు, సినిమాటోగ్రఫీ యాక్ట్, విదేశీ యాక్ట్ కింద 10 సెక్షన్లు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఫోర్జరీతో పాటు మరో 2 సెక్షన్లను జోడించారు. రవిని పోలీసులు నిన్న కస్టడీలోకి తీసుకుని 6hrs విచారించారు. నేటి నుంచి మరో 4 రోజులపాటు విచారించనున్నారు.


