News January 2, 2025
8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన
AP: ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు శంకుస్థాపన, జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు ఈనెల 4న నిర్వహించనున్న నేవీ డే పరేడ్, 8న PM సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
Similar News
News January 21, 2025
BIG BREAKING: జనసేనకు ఈసీ గుర్తింపు
జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ చిహ్నాన్ని రిజర్వ్ చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ పంపింది. ఇంతకాలం రిజిస్టర్డ్ పార్టీగా ఉన్న జనసేన.. గుర్తింపు పొందిన పార్టీగా మారడంతో ఆ గుర్తును ఇకపై ఎవరికీ కేటాయించరు. 2014లో ఆవిర్భవించిన జనసేన ఆ ఏడాది ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019లో రాజోలు ఎమ్మెల్యే సీటు గెలిచింది. 2024లో పోటీ చేసిన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సొంతం చేసుకుంది.
News January 21, 2025
కార్చిచ్చు రేగిన LAలో ట్రంప్ పర్యటన
అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన ట్రంప్.. ప్రకృతి విధ్వంసం సృష్టించిన ప్రాంతాలకు వెళ్లనున్నారు. కార్చిచ్చుతో భారీగా నష్టపోయిన కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజెలిస్‌లో శుక్రవారం పర్యటించనున్నారు. అలాగే నార్త్ కరోలినాలో హరికేన్ ప్రభావాన్ని పరిశీలించనున్నారు. ట్రంపునకు ఇదే తొలి అధికారిక పర్యటన.
News January 21, 2025
టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్: నారా లోకేశ్
AP: టెక్ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ స్థానంలో ఉందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. AIలోనే కాకుండా డీప్ టెక్‌లోనూ తాము ముందున్నామని దావోస్‌లో చెప్పారు. మరోవైపు ఇదే సదస్సులో CM చంద్రబాబు పలు కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఎల్జీ కెమ్, సిస్కో, కార్ల్స్ బెర్గ్, మార్క్స్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు CM ట్వీట్ చేశారు. ఈ కంపెనీలన్నింటికి ఆహ్వానం పలుకుతున్నట్లు పేర్కొన్నారు.