News September 1, 2024
CMలకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్
తెలుగు రాష్ట్రాల్లో వరదల వల్ల జరిగిన నష్టాన్ని ప్రధాని మోదీ TG CM రేవంత్, AP CM చంద్రబాబును అడిగి తెలుసుకున్నారు. ఇద్దరితో ఫోన్లో మాట్లాడారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలను మోదీ అభినందించారు. హెలికాప్టర్లను పంపిస్తామని హామీ ఇచ్చారు.
Similar News
News September 19, 2024
ఈ నెల 21న సీఎంగా ఆతిశీ ప్రమాణం
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆతిశీతో పాటు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారని ఆప్ తెలిపింది. కాగా మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేశారు. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీని ప్రకటించారు.
News September 19, 2024
కోడలిపై లైంగిక వేధింపులు.. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు
TG: కోడలిని లైంగిక వేధింపులకు గురి చేసిన భద్రాచలం ఆలయ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు, ఆయన దత్త పుత్రుడిపై వేటు పడింది. APలోని ప.గో.లో ఆయనపై కేసు నమోదవ్వగా తెలంగాణ దేవాదాయశాఖ చర్యలకు దిగింది. సీతారామకు కొడుకులు లేకపోవడంతో వెంకట సీతారాంను దత్తత తీసుకుని తాడేపల్లి గూడెంకు చెందిన యువతితో పెళ్లి చేశారు. ఈ క్రమంలో తన పోలికలతో వారసుడు కావాలని కోడలిని వేధించగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.
News September 19, 2024
‘దేవర’ రన్ టైమ్ ఎంతంటే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ ఈనెల 27న రిలీజ్ కానుంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయ్యే ఈ సినిమా టైటిల్ & ఎండ్ క్రెడిట్స్ కాకుండా 2 గంటల 42 నిమిషాల నిడివితో ఉంటుందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచగా మరింత హైప్ ఇచ్చేందుకు మేకర్స్ అన్ని భాషల్లో ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే HYDలో మూవీ ప్రీరిలీజ్ వేడుక ఉండే అవకాశం ఉంది.