News October 1, 2024

ప్రైవేట్ మద్యం దుకాణాలు.. రూ.2 లక్షలు చెల్లిస్తే..

image

AP: ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి, ప్రైవేటుకు అనుమతిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నేటి నుంచి అక్టోబర్ 9 వరకు 3,396 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో దానికి రూ.2 లక్షల చొప్పున చెల్లించాలి. 11న లాటరీ తీస్తారు. 12 నుంచి ప్రైవేట్ షాపులు తెరుచుకుంటాయి. 10 రకాల పన్నులను 6కి తగ్గించడంతో రూ.99కే క్వార్టర్ మద్యం లభించేలా ఎమ్మార్పీలు నిర్ణయించారు.

Similar News

News October 5, 2024

బొగ్గు కన్నా LNGతోనే ఎక్కువ నష్టం

image

పర్యావరణ అనుకూల ఇంధనంగా భావించే LNG(లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్) గురించి ఓ షాకింగ్ రిపోర్టును కార్నెల్ వర్సిటీ(US) శాస్త్రవేత్తలు బయటపెట్టారు. వంట, విద్యుత్ ఫ్యాక్టరీల్లో ఎక్కువగా వినియోగించే దీనివల్ల 20 ఏళ్లలో బొగ్గు కన్నా 33% ఎక్కువగా గ్రీన్‌హౌస్ వాయువులు విడుదలైనట్లు తెలిపారు. కాగా మీథేన్‌తో తయారయ్యే సహజ వాయువులను LNGగా మార్చడానికి మైనస్ 105 డిగ్రీల సెల్సియస్‌కు చల్లబర్చాల్సి ఉంటుంది.

News October 5, 2024

ఈసారి చలి తీవ్రత అధికం: IMD

image

దేశవ్యాప్తంగా ఈ ఏడాది చలి తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని IMD వెల్లడించింది. తిరోగమనంలో నైరుతి రుతుపవనాల కదలిక నెమ్మదిగా ఉందని, దీనివల్ల ఈ నెలలో ‘లా నినా’ ఏర్పడే పరిస్థితులున్నాయని తెలిపింది. వాయవ్య, మధ్య భారతదేశంలో విపరీతమైన చలిగాలులు వీస్తాయంది. పసిఫిక్ మహా సముద్రంలో భూమధ్య రేఖ వెంబడి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పడిపోయినప్పుడు లా నినా ఏర్పడుతుంది. ఉష్ణోగ్రత తగ్గుదల 3-5 డిగ్రీలు ఉండొచ్చు.

News October 5, 2024

రూ.150 కోసం ఫ్రెండ్స్ మధ్య ఘర్షణ.. వ్యక్తి మృతి

image

AP: కృష్ణా(D) కంకిపాడు(M) ప్రొద్దుటూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రూ.150 నగదు విషయంలో స్నేహితులు భుజంగరావు, వెంకటస్వామి మధ్య గొడవ ఏర్పడింది. వెంకటస్వామి ఆగ్రహంతో భుజంగరావు గుండెపై గట్టిగా కొట్టారు. అతను గతేడాదే హార్ట్ సర్జరీ చేయించుకోవడంతో కొట్టిన దెబ్బలకు స్పృహ కోల్పోయారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.