News January 11, 2025

ప్రైవేటు సరే.. మీరెందుకు పెంచారు సార్?

image

TG: ప్రైవేట్ బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సంక్రాంతి కోసం TGSRTC నడుపుతున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీలు పెంచారని, దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నిస్తున్నారు. అటు APSRTC స్పెషల్ బస్సుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడంతో ఏపీకి వెళ్లే చాలా మంది ఆ బస్సులే ఎక్కుతున్నారు.

Similar News

News December 27, 2025

న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

image

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్‌ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.

News December 27, 2025

జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

image

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

News December 27, 2025

పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

image

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్‌ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.