News January 11, 2025

ప్రైవేటు సరే.. మీరెందుకు పెంచారు సార్?

image

TG: ప్రైవేట్ బస్సుల యజమానులు అదనంగా ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. సంక్రాంతి కోసం TGSRTC నడుపుతున్న 6,432 స్పెషల్ బస్సుల్లో 50% ఛార్జీలు పెంచారని, దీనిపై ఎవరికి ఫిర్యాదు చేయాలని ప్రశ్నిస్తున్నారు. అటు APSRTC స్పెషల్ బస్సుల్లోనూ ఎలాంటి అదనపు ఛార్జీలు లేకపోవడంతో ఏపీకి వెళ్లే చాలా మంది ఆ బస్సులే ఎక్కుతున్నారు.

Similar News

News January 17, 2025

తెలంగాణకు 2,800 బస్సులు కేటాయించండి: సీఎం రేవంత్

image

TG: కాలుష్య నివారణకు HYD మహానగరంలో వంద శాతం బస్సులను ఎలక్ట్రిక్ మోడల్‌లోకి మార్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి కుమారస్వామిని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రస్తుతం ఉన్న డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ కిట్ అమర్చి రిట్రో ఫిట్మెంట్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చే విషయాన్ని కుమారస్వామి దృష్టికి తీసుకెళ్లారు. నగరానికి కేటాయించే 2,800 బస్సులను జీసీసీతో పాటు రిట్రో ఫిట్మెంట్ కింద కేటాయించాలని కోరారు.

News January 17, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News January 17, 2025

భక్తులకు టీటీడీ కీలక సూచనలు

image

AP: నేటితో వైకుంఠద్వార దర్శన టోకెన్ల జారీ ముగియనుందని భక్తులకు టీటీడీ సూచించింది. ఈ నెల 19తో వైకుంఠద్వార దర్శనం ముగుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ నెల 20న దర్శనం చేసుకునే భక్తులను సర్వదర్శనం క్యూలైన్‌లో మాత్రమే అనుమతిస్తామని తెలిపింది. ఈ నెల 20న ప్రోటోకాల్ భక్తులను మినహాయించి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేసింది. వీటిని దృష్టిలో పెట్టుకుని భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.