News February 5, 2025
ప్రైవేటు వీడియోల కేసు.. డ్రగ్ టెస్ట్‌లో నిందితులకు పాజిటివ్

అమ్మాయిల ప్రైవేట్ వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. డ్రగ్ టెస్ట్‌లో మస్తాన్ సాయి, అతని ఫ్రెండ్ ఖాజాకు పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మస్తాన్‌పై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు. 2022లో తన ఇంట్లో పార్టీ నిర్వహించిన మస్తాన్ సాయి ఆ సమయంలో తనకు డ్రగ్స్ ఇచ్చి ప్రైవేట్ వీడియోలు తీశారని లావణ్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.
News April 16, 2026
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 528 పాయింట్ల లాభంతో 78,639 వద్ద, నిఫ్టీ 153 పాయింట్లు పెరిగి 24,387 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఎటర్నల్, బజాజ్ ఫైనాన్స్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, రిలయన్స్, టైటాన్, ఎయిర్‌టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News April 16, 2026
డీలిమిటేషన్.. ఏ జిల్లాలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు?

జనాభా ప్రాతిపదికనే MP సీట్ల పెంపు ఉంటుందన్న సంకేతాల నేపథ్యంలో TGలో అసెంబ్లీ స్థానాలు 178కి చేరనున్నాయి. HYD-20, RR, మేడ్చల్-12 చొప్పున, NZB, NLG, సంగారెడ్డిలో ఎనిమిదేసి, KMM-7, SRPT-6, MBNR, VKB, SDPT, కామారెడ్డి, KNR, HNK, కొత్తగూడెంలో ఐదేసి, ADB, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, MHBD, WGL, MDK, యాదాద్రి, నాగర్‌కర్నూల్‌లో 4, నారాయణ్‌పేట్, వనపర్తి, గద్వాల్, జనగామ, ASF-3, భూపాలపల్లి-2, ములుగు-1.


