News January 22, 2025

డిపోల ప్రైవేటీకరణ అవాస్తవం: TGSRTC

image

ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని TGSRTC ఖండించింది. ఎలక్ట్రిక్ బస్సుల మెయిన్‌టనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా TGSRTC ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే ఎలక్ట్రిక్ బస్సుల్ని తీసుకొస్తున్నామని, ఈ ఏడాది మేలో మరిన్ని బస్సులు అందుబాటులోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News February 15, 2025

రేవంత్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు: కిషన్ రెడ్డి

image

TG: సీఎం స్థాయిలో ఉండి ప్రధాని మోదీ కులంపై రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సరికాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని గుర్తు చేశారు. అటు మండల్ కమిషన్ సిఫార్సులను కాంగ్రెస్ తొక్కిపెట్టిందని, బీజేపీ వచ్చాకే అమలుపర్చిందని తెలిపారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కులగణన ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.

News February 15, 2025

5 ఖండాలను లింక్ చేస్తూ మెటా కేబుల్.. భారత్ కీ రోల్!

image

భారత్ సాయంతో ప్రపంచంలో అతి పొడవైన సముద్ర కేబుల్ వేసేందుకు మెటా కంపెనీ ప్లాన్ చేస్తోంది. 5 ఖండాలను లింక్ చేస్తూ 50వేల కి.మీ మేర సముద్రం లోపల కేబుల్ వేయనున్నట్లు మెటా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు విలువ 10 బిలియన్ డాలర్లు అని, ఏఐ సర్వీసులు, డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరుస్తామని వెల్లడించింది. ఈ ప్రాజెక్టు మెయింటనెన్స్, ఫైనాన్సింగ్‌లో భారత్ కీలకపాత్ర పోషించనుంది.

News February 15, 2025

రూ.100 కోట్లకు చేరువలో ‘తండేల్’

image

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన ‘తండేల్’ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. విడుదలైన 8 రోజుల్లోనే రూ. 95.20 కోట్లు రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. త్వరలో రూ.100 కోట్ల మార్కును అందుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈ నెల 7న విడుదలైంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.

error: Content is protected !!