News September 12, 2024
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ.. తెలుగు జాతికి పెద్ద ద్రోహం: ఎంపీ VSR

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3ని ఆపేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ఇది కార్మికుల గొంతు కోయడమేనని, తెలుగు జాతికి పెద్ద ద్రోహమని మండిపడ్డారు. చంద్రబాబు హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్లేనన్నారు. ప్రజా సంపదను అమ్మేస్తుంటే YCP ఊరుకోదని, రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి ఫ్యాక్టరీని రక్షించే దాకా పోరాటం సాగిస్తుందని ట్వీట్ చేశారు.
Similar News
News September 18, 2025
ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ

ఆస్ట్రేలియా-Aతో లక్నోలో జరుగుతున్న తొలి అనధికార టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో IND-A ప్లేయర్ ధ్రువ్ జురెల్ సూపర్ సెంచరీ(113*) సాధించారు. తన ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. పడిక్కల్(86*), సాయి సుదర్శన్(73), జగదీశన్(64) అర్ధశతకాలతో రాణించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 4 వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన AUS-A 532/6కు డిక్లేర్ చేసింది.
News September 18, 2025
జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం

AP: జీఎస్టీ సంస్కరణలపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కేంద్రం తీసుకొచ్చిన కొత్త పన్నుల విధానంతో ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నుల విధానంలో 2 శ్లాబులు (5%,18%) మాత్రమే ఉంచి సరళతరం చేశారని పేర్కొన్నారు.
News September 18, 2025
తప్పిన మరో పెను విమాన ప్రమాదం

విశాఖ నుంచి HYD ప్రయాణించాల్సిన ఎయిరిండియా విమానానికి పెనుప్రమాదం తప్పింది. విశాఖలో టేకాఫ్ అయిన కాసేపటికే ఫ్లైట్ ఇంజిన్ ఫ్యాన్ రెక్కల్లో పక్షి చిక్కుకుంది. దీంతో ఫ్యాన్ రెక్కలు దెబ్బతిన్నాయి. అప్రమత్తమైన పైలట్ విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్ ల్యాండింగ్ చేశారు. ఆ టైంలో విమానంలో 103మంది ప్రయాణికులున్నారు. కొన్నినెలల కింద అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్‌లో 270మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.