News September 12, 2024

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ.. తెలుగు జాతికి పెద్ద ద్రోహం: ఎంపీ VSR

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లోని బ్లాస్ట్ ఫర్నేస్-3ని ఆపేయాలన్న నిర్ణయం ప్రైవేటీకరణ కుట్రలో భాగమని YCP MP విజయసాయిరెడ్డి చెప్పారు. ఇది కార్మికుల గొంతు కోయడమేనని, తెలుగు జాతికి పెద్ద ద్రోహమని మండిపడ్డారు. చంద్రబాబు హామీలన్నీ యథావిధిగా గాలికి కొట్టుకుపోయినట్లేనన్నారు. ప్రజా సంపదను అమ్మేస్తుంటే YCP ఊరుకోదని, రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి ఫ్యాక్టరీని రక్షించే దాకా పోరాటం సాగిస్తుందని ట్వీట్ చేశారు.

Similar News

News October 7, 2024

వామ్మో.. యువతి పొట్టలో 2 కిలోల జుట్టు!

image

UPలోని లక్నోలో ఓ యువతి(21) పొట్ట నుంచి వైద్యులు 2 కిలోల జుట్టును సర్జరీ ద్వారా తొలగించారు. గడచిన 16 ఏళ్లుగా ఆమె తన జుట్టు తనే పీకేసి తినేస్తోందని తెలిపారు. వైద్య పరిభాషలో దీన్ని ట్రికోఫేగియా లేదా రపంజెల్ సిండ్రోమ్‌గా వ్యవహరిస్తామని వివరించారు. పొట్టలోపల మొత్తం మాత్రమే కాక పేగుల్లోకి కూడా జుట్టు చుట్టుకుందని పేర్కొన్నారు. తరచూ వాంతులవుతుండటంతో పరీక్షలు నిర్వహించగా ఈ విషయం బయటపడినట్లు వెల్లడించారు.

News October 7, 2024

అమెరికాలో 227కు చేరిన హెలీన్ హరికేన్ మృతులు

image

అమెరికాలో హెలీన్ పెను తుఫాను గత నెలాఖరులో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇప్పటి వరకు ఆరు రాష్ట్రాల్లో కలిపి 227 మృతదేహాల్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ-4 తీవ్రతతో విరుచుకుపడిన హెలీన్ తన దారిలో ఉన్న ప్రతి దాన్నీ ధ్వంసం చేసింది. 2005లో వచ్చిన కత్రీనా తుఫాను తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనదని అధికారులు పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చని అంచనా వేశారు.

News October 7, 2024

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ?

image

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడ జరిగే హోంమంత్రి సమావేశంలో వీరిద్దరూ పాల్గొంటారు. అనంతరం వీరిరువురూ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే రేవంత్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. చంద్రబాబు రేపు మధ్యాహ్నం హస్తినకు వెళ్తారు.