News September 19, 2024

పాక్ హాకీ ఆటగాళ్లకు రూ.8,366ల బహుమతి

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించిన పాక్ హాకీ టీమ్‌కు ఆ దేశ హాకీ ఫెడరేషన్ బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బందికి 100 డాలర్ల(రూ.8,366) చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని తెలిపింది. ఇంత తక్కువ ఇవ్వడం దారుణమని, అసలు ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్.. కాంస్య పతక పోరులో కొరియాపై 5-2 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Similar News

News October 14, 2024

భోజనం చేస్తుంటే కాల్పులు జరిపారు: మావోయిస్టులు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది 31 మంది కాదని, 35 మంది అని మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ కమిటీ ప్రకటించింది. ‘ఈ నెల 4న భోజనం చేస్తుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఒకే రోజు 11 సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా, గాయపడిన వారిని మరుసటిరోజు కాల్చి చంపారు. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాం’ అని పేర్కొంది.

News October 14, 2024

నేడే మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు వచ్చిన 89,882 దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ లాటరీ తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అలాగే ఫారిన్ లిక్కర్ ఎమ్మార్పీపై చిల్లర ధర లేకుండా సర్దుబాటు చేయనుంది.

News October 14, 2024

బాబా సిద్దిఖీ హత్య.. అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్

image

సల్మాన్ ఖాన్ ఫ్రెండ్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. 30 ఏళ్ల బిష్ణోయ్ చండీగఢ్‌లో చదువుకునే సమయంలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయమైంది. ఆ తర్వాత అతడితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. 2012 నుంచి ఆయన ఎక్కువ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తాడు. తమకు ఇష్టమైన కృష్ణ జింకలను చంపాడనే కోపంతో సల్మాన్‌పై పగబట్టాడు.