News November 8, 2024
స్పిరిట్, యానిమల్ పార్క్‌పై నిర్మాత కీలక వ్యాఖ్యలు

ప్రభాస్-సందీప్‌రెడ్డి కాంబోలో ‘స్పిరిట్’ పూర్తయిన తర్వాతే రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ ఉంటుందని Tసిరీస్ ఎండీ భూషణ్ కుమార్ వెల్లడించారు. స్పిరిట్‌ను 2026లో, యానిమల్-2ను 2027లో రిలీజ్ చేసే అవకాశం ఉందన్నారు. వచ్చే ఏడాది రైడ్-2, దే దే ప్యార్ దే-2(అజయ్ దేవగణ్)ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని తెలిపారు. ఢమాల్-3, బోర్డర్-2 సినిమాలను 2026లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 8, 2026
ఇంగ్లండ్‌పై పోరాడి ఓడిన నేపాల్

T20WC: ఇంగ్లండ్-నేపాల్ మధ్య పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నేపాల్ 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీపేంద్ర సింగ్(44), కెప్టెన్ రోహిత్ పౌడెల్(39) పోరాటం వృథా అయ్యింది. కుశాల్(29), లోకేశ్(39) కూడా అద్భుతంగా రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో డాసన్ 2, ఆర్చర్, విల్ జాక్స్, సామ్ కరన్, ఉడ్ తలో వికెట్ తీశారు.
News February 8, 2026
ఆలయాలకు గోపురం ఎందుకు ఉంటుంది?

గోపురం ఆధ్యాత్మిక, శాస్త్రీయ, సామాజిక అవసరాల సమాహారం. ఆగమ శాస్త్రం ప్రకారం ఇది దేవుని పాదాలకు సంకేతం. గుడిపై ఈ నిర్మాణం విశ్వశక్తిని గ్రహిస్తుంది. గుడికి శక్తి కేంద్రంగా నిలుస్తుంది. దేవుడే సర్వోన్నతుడని చాటుతుంది. ఎత్తుగా ఉండి బాటసారులకు దిక్సూచిగా మార్గం చూపుతుంది. పిడుగుల నుంచి రక్షణ కవచంగా పనిచేస్తుంది. దూరం నుంచి గోపురాన్ని దర్శించినా దైవకృప లభిస్తుందని నమ్మకం. మన సంస్కృతికిది నిలువుటద్దం.
News February 8, 2026
మీరు వెజిటేరియన్సా? వీటితో ప్రొటీన్ డెఫీషియన్సీకి చెక్

3 టేబుల్ స్పూన్ల జనపనార గింజల(Hemp Seeds)తో 10గ్రా. ప్రొటీన్లు బాడీకి అందుతాయి. వీటిలో 9 రకాల అమైనో యాసిడ్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం ఉంటాయి. 28గ్రా. గుమ్మడికాయ గింజల(Pumpkin Seeds)లో 7గ్రా. ప్రొటీన్ లభిస్తుంది. వీటిలోని జింక్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. 28గ్రా. పొద్దుతిరుగుడు విత్తనాల(Sunflower Seeds)లో 6గ్రా. ప్రొటీన్ ఉంటుంది. వీటిలోని విటమిన్ E, మెగ్నీషియం కణాలను రక్షిస్తాయి.


