News December 1, 2024
బుర్రా వెంకటేశంకు ప్రమోషన్

TG: సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ జీవో ఇచ్చింది. ఇప్పటికే VRS కోసం దరఖాస్తు చేసుకున్న ఆయన కొత్త హోదాలో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం TGPSC ఛైర్మన్గా బాధ్యతలు చేపడతారు. గురుకులంలో చదివి IAS స్థాయికి వెళ్లిన ఆయన పలు జిల్లాలకు కలెక్టర్గా, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Similar News
News October 18, 2025
మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?

TG: BC సంఘాల ‘రాష్ట్ర బంద్’ పిలుపు మేరకు పలు స్కూళ్ల యాజమాన్యాలు సెలవులిస్తూ తల్లిదండ్రులకు మెసేజులు పంపాయి. OU పరిధిలో ఇవాళ జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు యథావిధిగా నడవనుండగా బంద్ పాటించాలని BC, విద్యార్థి సంఘాలు కోరే అవకాశముంది. మరోవైపు RTC డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. ఇప్పటికే పలు పార్టీలు రోడ్లపైకి వచ్చి బంద్ పాటిస్తున్నాయి. ఇంతకీ మీ దగ్గర స్కూళ్ల బంద్ ఉందా?
News October 18, 2025
వరి కోత సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వరి పంట కోతకి వారం లేదా 10 రోజుల ముందు నుంచే నీటి తడిని ఆపివేయాలి. కంకిలో 90 శాతం గింజలు పక్వానికి వచ్చాకే వరి కోత చేపట్టాలి. గడ్డి పొడిపొడిగా, గింజలు బంగారు రంగులోకి, ఎర్ర గొలుసుగా మారి కంకులు కిందకి వంగినప్పుడు కోతలను చేపట్టాలి. పంట పక్వానికి రాకముందే కోస్తే, కంకిలోని గింజలు పూర్తిగా నిండక దిగుబడి తగ్గే అవకాశం ఉంది. మరీ ఆలస్యంగా కోస్తే చేను పడిపోయి గింజ ఎక్కువగా రాలి దిగుబడి తగ్గే అవకాశం ఉంది.
News October 18, 2025
GHMCలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

TG: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో 17 ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. సీనియర్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, మైక్రో బయాలజిస్ట్, ఎంటమాలజిస్ట్, వెటర్నరీ ఆఫీసర్, ఫుడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, MBBS, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.