News December 1, 2024
బుర్రా వెంకటేశంకు ప్రమోషన్
TG: సీనియర్ IAS అధికారి బుర్రా వెంకటేశంకు ప్రభుత్వం ప్రమోషన్ కల్పించింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయనకు పదోన్నతి కల్పిస్తూ జీవో ఇచ్చింది. ఇప్పటికే VRS కోసం దరఖాస్తు చేసుకున్న ఆయన కొత్త హోదాలో పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం TGPSC ఛైర్మన్‌గా బాధ్యతలు చేపడతారు. గురుకులంలో చదివి IAS స్థాయికి వెళ్లిన ఆయన పలు జిల్లాలకు కలెక్టర్‌గా, ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Similar News
News December 2, 2024
డిసెంబర్ 02: చరిత్రలో ఈ రోజు
1984: భోపాల్ విషవాయువు దుర్ఘటన సంభవించిన రోజు
1912: దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం
1960: నటి సిల్క్ స్మిత జననం
1985: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు
1989: భారత దేశ 8వ ప్రధానిగా వీపీ సింగ్ నియామకం
1996: ఉమ్మడి ఏపీ సీఎం మర్రి చెన్నారెడ్డి మరణం
జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
News December 2, 2024
హైదరాబాద్‌లో భారీ వర్షం
TG: ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్‌తో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, సుచిత్ర, కొంపల్లి తదితర ప్రాంతాల్లో వాన పడింది.
News December 2, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.