News August 19, 2024
ఉద్యోగులకు ప్రమోషన్లు.. CM, Dy.CM ఫొటోలకు పాలాభిషేకం

TG: సదరన్ డిస్కంలో ఒకే రోజు 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో సీఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ CM, డిప్యూటీ సీఎం ఫొటోలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ వారంలోనే పరిష్కరించిందని పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే

66 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్‌నెస్‌లో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు కింగ్ నాగార్జున. తాజాగా తన ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు. డైటింగ్ కంటే టైమ్‌కు ఫుడ్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు. గత 45 ఏళ్లుగా ఒక్కరోజు కూడా జిమ్ మిస్ కాలేదని పేర్కొన్నారు. పాజిటివ్ థింకింగ్, మెంటల్ హెల్త్ కూడా కీలకమని చెప్పారు. 2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు.
News December 30, 2025
సంక్రాంతికి టోల్‌ప్లాజాల వద్ద రద్దీ లేకుండా చర్యలు: కోమటిరెడ్డి

TG: టోల్ ప్లాజాల వద్ద రద్దీ లేకపోతే అసౌకర్యం ఉండదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతికి నేషనల్ హైవేలపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఆయన సమీక్షించారు. ‘CM ఈ అంశంపై సీరియస్‌గా ఉన్నారు. సంక్రాంతికి టోల్ ప్లాజాల వద్ద ఫ్రీ వే ఏర్పాటుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాస్తాను. మేడారం జాతరకు వెళ్లే లక్షలాది భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరతాను’ అని తెలిపారు.
News December 30, 2025
సూర్యకుమార్ మెసేజ్ చేసేవాడు.. బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు!

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై ‘MTV స్ప్లిట్స్‌విల్లా’ ఫేమ్ ఖుషీ ముఖర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో సూర్య తనకు తరచూ మెసేజ్ చేసేవాడని తెలిపారు. ప్రస్తుతం ఇద్దరం మాట్లాడుకోవడం లేదని చెప్పారు. ఏ క్రికెటర్‌తోనైనా డేటింగ్ చేయాలనుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. తన వెనుక చాలామంది పడుతున్నారని.. కానీ తాను ఎవరితోనూ అసోసియేట్ అవ్వాలనుకోవడం లేదని అనడం ఇప్పుడు SMలో వైరల్‌గా మారింది.


