News August 19, 2024
ఉద్యోగులకు ప్రమోషన్లు.. CM, Dy.CM ఫొటోలకు పాలాభిషేకం
TG: సదరన్ డిస్కంలో ఒకే రోజు 2,263 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తూ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలు జారీ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలతో సీఎండీ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో ఉద్యోగుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ CM, డిప్యూటీ సీఎం ఫొటోలకు ఉద్యోగులు పాలాభిషేకం చేశారు. గత ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని, కాంగ్రెస్ వారంలోనే పరిష్కరించిందని పేర్కొన్నారు.
Similar News
News September 19, 2024
యువ CA మృతిపై కేంద్రం విచారణ
ఛార్టెడ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్(26) <<14129191>>మృతిపై <<>>కేంద్రం విచారణ మొదలుపెట్టింది. తన కూతురు ఆఫీస్‌లో అదనపు పని ఒత్తిడి వల్లే చనిపోయిందని ఆమె తల్లి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పని ప్రదేశాల్లో అసురక్షిత వాతావరణం, శ్రమ దోపిడీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో BJP నేత రాజీవ్ చంద్రశేఖర్ కేంద్రం జోక్యాన్ని డిమాండ్ చేయడంతో కేంద్ర కార్మికశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.
News September 19, 2024
అట్లీతో తప్పకుండా సినిమా చేస్తా: NTR
‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ అట్లీతో తీసే సినిమాపై క్లారిటీ ఇచ్చారు. ‘అట్లీ గ్రేట్ డైరెక్టర్. ఆయన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ చెప్పారు. రొమాంటిక్ కామెడీ స్టోరీని కూడా డిస్కస్ చేశాం. తర్వాత ఇద్దరం బిజీ అయిపోయాం. కానీ, తప్పకుండా ఇద్దరం కలిసి ఓ సినిమా తీస్తాం. ఆయన తీసిన రాజా-రాణి అంటే నాకెంతో ఇష్టం’ అని ఎన్టీఆర్ తెలిపారు.
News September 19, 2024
వ్యర్థాల తొలగింపుపై హైడ్రా కీలక నిర్ణయం
TG: అక్రమ నిర్మాణాల కూల్చివేతకు ఏర్పాటైన హైడ్రా కీలక నిర్ణయం తీసుకుంది. కూల్చివేత వ్యర్థాలను తొలగించేందుకు టెండర్లను ఆహ్వానించింది. నేటి నుంచి ఈ నెల 27 వరకు ఆఫ్‌లైన్‌లో బిడ్లు స్వీకరించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది.