News July 27, 2024

పోర్టుల అభివృద్ధికి రూ.3,300 కోట్లతో ప్రతిపాదనలు

image

AP: భావనపాడు, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టుల అభివృద్ధికి PM గతిశక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం సాయం కోరిందని కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ వెల్లడించారు. ఈ మేరకు రూ.3300 కోట్లతో ప్రతిపాదనలు వచ్చాయన్నారు. కొత్త జెట్టీలు, హార్బర్ల నిర్మాణానికి వచ్చిన ప్రతిపాదనలను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. లోక్‌సభలో బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.

Similar News

News December 12, 2024

తీవ్ర విషాదం.. 55 గంటలు కష్టపడినా!

image

రాజస్థాన్ దౌసాలో విషాదం నెలకొంది. ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో పడిన ఐదేళ్ల చిన్నారి మృతిచెందాడు. 55 గంటల పాటు పొక్లెయిన్లతో బాలుడిని వెలికితీసేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన శ్రమ వృథా అయింది. చిన్నారిని వెలికితీసి ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే చనిపోయాడు. బాలుడి ఒంటిపై గాయాలు ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. గాయాలు, ఆక్సిజన్ కొరత వల్ల బాలుడు మృతి చెందాడని చెప్పారు.

News December 12, 2024

‘పుష్ప2’ వ్యాఖ్యలపై సిద్ధార్థ్ క్లారిటీ

image

‘పుష్ప2’ సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలకు కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ క్లారిటీ ఇచ్చారు. తన వ్యాఖ్యలు వక్రీకరించారని ఆయన అన్నారు. ‘ఇండస్ట్రీ ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. నటీనటులు, దర్శకులు, నిర్మాతలకు ఎప్పుడూ మంచి జరగాలి. కళాకారుల శ్రమకు తగ్గ ఫలితం ఉండాలి. నాకు అల్లు అర్జున్‌తో శత్రుత్వమేమీ లేదు. నేను ఎవరినీ వ్యక్తిగతంగా కానీ, ఏదో సినిమాపై కానీ ఆ వ్యాఖ్యలు చేయలేదు’ అని ఆయన స్పష్టం చేశారు.

News December 12, 2024

బిగ్‌బాస్-8 గ్రాండ్ ఫినాలేకు అల్లు అర్జున్?

image

బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్ ఫినాలే వచ్చే ఆదివారం జరగనుంది. పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద రూ.వెయ్యి కోట్లు కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఈ మెగా ఈవెంట్‌కు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. విన్నర్‌కు ఆయనే ట్రోఫీ అందజేస్తారని తెలుస్తోంది. ఇవాళో, రేపో దీనిపై క్లారిటీ రానుంది. మరోవైపు టాప్-5 ఫైనలిస్ట్స్‌లో అవినాశ్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నబీల్ ఉన్నారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారని మీరనుకుంటున్నారు?