News July 13, 2024

తెలంగాణలో గీత కార్మికులకు రక్షణ కిట్లు

image

TG: గీత కార్మికుల రక్షణ కోసం ‘కాటమయ్య రక్ష’ పేరుతో కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రేపు అందించనుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్(మ) లష్కర్‌గూడ గ్రామంలో కిట్లు అందించనున్న సీఎం రేవంత్ ఆ తర్వాత గౌడన్నలతో కలిసి భోజనం చేస్తారు. ఒక్కో కిట్‌లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. IIT హైదరాబాద్‌తో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ ఈ కిట్లను రూపొందించింది.

Similar News

News November 25, 2025

RR: మీ ఊర్లో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడంటే!

image

RR GP పోలింగ్ 3 విడతల్లో జరగనుంది. 11న 1st ఫేజ్‌లో షాద్‌నగర్‌లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్‌‌, శంషాబాద్‌ గ్రామాల్లో జరుగుతాయి. DEC14న 2వ ఫేజ్‌లో శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల, షాబాద్, ఆమనగల్, కడ్తాల్, తలకొండపల్లిలో ఉంటాయి. DEC17న 3వ ఫేజ్‌లో అబ్దుల్లాపూర్‌మెట్, ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, మాడ్గులతో పాటు కందుకూరు, మహేశ్వరంలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

image

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.