News July 13, 2024
తెలంగాణలో గీత కార్మికులకు రక్షణ కిట్లు
TG: గీత కార్మికుల రక్షణ కోసం ‘కాటమయ్య రక్ష’ పేరుతో కిట్లను బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రేపు అందించనుంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్(మ) లష్కర్‌గూడ గ్రామంలో కిట్లు అందించనున్న సీఎం రేవంత్ ఆ తర్వాత గౌడన్నలతో కలిసి భోజనం చేస్తారు. ఒక్కో కిట్‌లో తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ ఉంటాయి. IIT హైదరాబాద్‌తో కలిసి ఓ ప్రైవేట్ సంస్థ ఈ కిట్లను రూపొందించింది.
Similar News
News October 11, 2024
‘మా నాన్న సూపర్ హీరో’ మూవీ REVIEW
ఇది కన్నతండ్రి(సాయిచంద్), పెంచిన తండ్రి(సాయాజీ షిండే), ఓ కొడుకు(సుధీర్‌బాబు) మధ్య ముక్కోణపు ఎమోషనల్ కథ. డైరెక్టర్ అభిలాష్ కొత్త తరహా కథాంశాన్ని ఎమోషనల్ డ్రామాగా తీర్చిదిద్దారు. పెంచిన తండ్రి అప్పు తీర్చేందుకు హీరో కష్టాలు, కొడుకు ప్రేమకై తపించే కన్నతండ్రి యాంగిల్ ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ సన్నివేశాలు బాగున్నా పాత్రల మధ్య కొరవడిన భావోద్వేగాలు, స్లో నరేషన్, చివరి 20 నిమిషాలు మైనస్.
రేటింగ్: 2.5/5
News October 11, 2024
16 నుంచి ఇంటర్ కాలేజీల టైమింగ్స్ మార్పు
AP: ప్రభుత్వ జూనియర్, ఎయిడెడ్ కాలేజీల సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం ఉ.9 నుంచి సా.4 వరకు టైమింగ్స్ ఉండగా, ఈ నెల 16 నుంచి సా.5 వరకు సమయాన్ని పొడిగించింది. గత ఏడాది ఫలితాల్లో ఆశించిన స్థాయిలో విద్యార్థులు రాణించకపోవడంతో సా.4-5 గంటల మధ్య స్టడీ అవర్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు డైరెక్టర్ కృతిక శుక్ల ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించారు.
News October 11, 2024
OTTలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ
శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మత్తు వదలరా-2’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. రితీశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ మూవీ గత నెల 13న విడుదలైన సూపర్ హిట్‌గా నిలిచింది. కాలభైరవ సంగీతం అందించగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించారు. వెన్నెల కిశోర్, సునీల్, రోహిణి, ఝాన్సీ కీలక పాత్రలు పోషించారు.