News December 31, 2024
RSSకు వ్యతిరేకంగా ఉద్యమించండి: పినరయి
కేరళకు వ్యతిరేకంగా RSS చేస్తున్న విద్వేష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ప్రజాస్వామ్యవాదులు ఏకమవ్వాలని CM పినరయి విజయన్ పిలుపునిచ్చారు. కేరళ ‘<<15020450>>మినీ పాకిస్థాన్<<>>’ అంటూ మహారాష్ట్ర మంత్రి నితేశ్ రాణే చేసిన వ్యాఖ్యల్ని ఆయన తప్పుబట్టారు. కేరళ మినీ పాక్ కావడం వల్ల అక్కడి టెర్రరిస్టులు వేసే ఓట్లతో రాహుల్ గాంధీ, ప్రియాంక గెలిచారని నితేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
Similar News
News January 20, 2025
అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడి మృతి
అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడు మృతిచెందాడు. చైతన్యపురికి చెందిన రవితేజ 2022లో అమెరికా వెళ్లి మాస్టర్స్ పూర్తి చేసి అక్కడే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతలో అతడు మరణించాడని తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News January 20, 2025
సైఫ్ ఇంట్లో నేడు క్రైమ్ సీన్ రీక్రియేషన్?
యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఇంట్లో పోలీసులు క్రైమ్ సీన్ రీక్రియేట్ చేస్తారని సమాచారం. అతడిపై కత్తితో అటాక్ చేసిన షరీఫుల్‌ను UPలో అరెస్టు చేశారు. అతడిని ఇప్పటికే ముంబై బాంద్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. నేడు భారీ భద్రత నడుమ సైఫ్ ఇంటికి తీసుకెళ్తారని వార్తలు వస్తున్నాయి. నిందితుడు రెక్కీ, దాడికి ప్లాన్ చేసిన తీరును తెలుసుకోనున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసులో తేలాల్సిన అంశాలు అనేకం ఉన్నాయి.
News January 20, 2025
పైసా ప్రయోజనం లేకున్నా సొంత ఎలివేషన్లకు బాబు ఖర్చు: వైసీపీ
AP: చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా దావోస్ పర్యటనలో ప్రముఖులతో మీటింగులంటూ ఫొటోలతో భారీగా ప్రచారం చేసుకుంటారని వైసీపీ విమర్శించింది. వారు చెప్పినట్లుగా ఒక్క ఐటీ పరిశ్రమ ఏపీలో ఏర్పాటు కాలేదని దుయ్యబట్టింది. మరోసారి చంద్రబాబు దావోస్ పర్యటనతో రాష్ట్రానికి పైసా ప్రయోజనం లేకపోయినా ఆయన సొంత ఎలివేషన్లకు ఏమాత్రం కొదవ లేకుండా భారీగా ఖర్చు చేస్తున్నారని మండిపడింది.