News December 30, 2024

ప్ర‌శాంత్ కిశోర్‌పై ఆందోళ‌నకారుల ఫైర్‌

image

పోలీసులు త‌మ‌పై లాఠీఛార్జ్ చేస్తున్న‌ప్పుడు ఎక్క‌డికెళ్లారంటూ ప్ర‌శాంత్ కిశోర్‌పై నిరుద్యోగులు మండిపడ్డారు. BPSC పరీక్ష‌ల్ని ర‌ద్దు చేయాల‌ని బిహార్ గ‌ర్దానీబాఘ్‌లో నిర‌స‌న‌కు దిగిన‌ ఆందోళ‌న‌కారుల‌పై PCలు గత రాత్రి లాఠీఛార్జ్ చేశారు. అనంత‌రం PK అక్క‌డికి చేరుకోగా ఆందోళనకారులు అడ్డుకున్నారు. అయితే మా బ్లాంకెట్లు తీసుకొని మాపైనే యాటిట్యూడ్ చూపిస్తారా అని PK వ్యాఖ్యానించడం ఉద్రిక్త‌త‌కు దారితీసింది.

Similar News

News December 10, 2025

తాజా సినీ ముచ్చట్లు

image

* యాంటీ ఏజింగ్ రీసెర్చ్ చేసేవాళ్లు కొన్నిరోజులు అక్కినేని నాగార్జున గారిపై పరిశోధనలు చేయాలి: విజయ్ సేతుపతి
* రోషన్ కనకాల-సందీప్ రాజ్ కాంబోలో వస్తున్న ‘మోగ్లీ’ చిత్రానికి ‘A’ సర్టిఫికెట్
* రాబోయే ఐదేళ్లలో దక్షిణాదిన రూ.12 వేల కోట్లతో కంటెంట్‌ని సృష్టించబోతున్నట్లు ప్రకటించిన జియో హాట్ స్టార్
* ‘అన్నగారు వస్తారు’ నాకో ఛాలెంజింగ్ చిత్రం: హీరో కార్తి

News December 10, 2025

చిన్నారులకు విటమిన్ డి ఎందుకు అవసరమంటే?

image

పిల్లల ఎముకలు,కండరాల ఆరోగ్యం విషయంలో విటమిన్ D పాత్ర చాలా ముఖ్యమైనది. రోగనిరోధక వ్యవస్థ పనితీరుతో పాటు మొత్తం శరీర ఆరోగ్యంలో D విటమిన్ కీలకపాత్ర పోషిస్తుంది. విటమిన్ D లోపం కారణంగా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. కీళ్ల నొప్పులు, నిరంతరం అలసట, జుట్టు పల్చబడటం, గాయాలు నెమ్మదిగా మానడం మొదలైనవి విటమిన్ D లోపానికి సంకేతాలు. ఈ లక్షణాలు పిల్లల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి.

News December 10, 2025

మరోసారి ఇండిగో విమానాల రద్దు

image

ఇండిగో విమానాల రద్దు మళ్లీ మొదలైంది. ఇవాళ దేశవ్యాప్తంగా సుమారు 300 సర్వీసులు క్యాన్సిల్ అయ్యాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 137, ముంబైలో 21, బెంగళూరులో 61 ఫ్లైట్స్ నిలిచిపోయాయి. శంషాబాద్ నుంచి బయల్దేరాల్సిన 70 విమానాలు కూడా రద్దయినట్లు తెలుస్తోంది. తీవ్ర సంక్షోభం తర్వాత తమ ఫ్లైట్స్ సర్వీసెస్ సాధారణ స్థితికి చేరాయని నిన్న ఇండిగో సీఈవో పీటర్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే మరోసారి విమాన సర్వీసులు రద్దయ్యాయి.