News January 7, 2025
కాంగ్రెస్ మోసంపై నిరసనలు ఢిల్లీకి చేరాయి: కేటీఆర్

TG: కాంగ్రెస్ అంటేనే కన్నింగ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం యూ టర్న్ తీసుకోవడంపై ఢిల్లీలోని ఏఐసీసీ ఆఫీసు వద్ద పోస్టర్లు వెలిశాయని తెలిపారు. ‘రైతు డిక్లరేషన్’ ఎలా అమలవుతుందో రాష్ట్రానికి వచ్చి వివరించవచ్చు కదా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. ‘అబద్ధాల కాంగ్రెస్‌లో అన్ని అరకొర గ్యారంటీలు, అర్ధ సత్యాలే’ అని ట్వీట్ చేశారు.
Similar News
News February 9, 2026
విమానాల నిర్వహణపై డిప్లొమా కోర్సు

TG: డిప్లొమా ఇన్ ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్(AME) కోర్సును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరం ఓ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశపెట్టి తర్వాత విస్తరించనుంది. ఒక్కో కాలేజీలో 60 సీట్లు ఉంటాయని తెలుస్తోంది. విమాన మరమ్మతులు, నిర్వహణ, సర్టిఫై తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. కొత్తగా సెమీకండక్టర్, ఆటోమేషన్& రోబోటిక్స్ వంటి మరో 9 కోర్సులు ప్రవేశపెట్టనున్నారు.
News February 9, 2026
శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు.. నేడు పట్టువస్త్రాల సమర్పణ

AP: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ రెండోరోజు సాయంత్రం ద్వారకా తిరుమల ఆలయం తరఫున పట్టువస్త్రాలను పండితులు సమర్పిస్తారు. రాత్రి స్వామి అమ్మవార్లకు భృంగి వాహనంపై గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 13 నుంచి 16 వరకు భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందజేస్తారు. ఈ నెల 18 వరకు కొనసాగే బ్రహ్మోత్సవాల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు.
News February 9, 2026
ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాక్ షరతులు?

T20 WCలో INDతో మ్యాచ్ ఆడేందుకు ICCకి పాక్ 3 షరతులు పెట్టిందని తెలుస్తోంది. ‘రెవెన్యూలో షేర్ పెంచాలి. ఇండియాతో ద్వైపాక్షిక క్రికెట్‌ను పునరుద్ధరించాలి. హ్యాండ్‌షేక్ ప్రొటోకాల్ కొనసాగించాలి’ అని కోరిందని సమాచారం. ICC, PCB మధ్య భేటీ ముగిసిందని, 24గంటల్లో పాక్ నిర్ణయం తీసుకోనుందని క్రీడావర్గాలు తెలిపాయి. మరోవైపు ఇదే మీటింగ్‌లో తమకు పరిహారం, ఓ ICC ఈవెంట్ నిర్వహణ హక్కులివ్వాలని <<18951531>>BCB<<>> కోరినట్లు చెప్పాయి.


