News December 20, 2024
మతపరమైన పాలనపై సిరియాలో నిరసనలు

మతపరమైన పాలన తమకొద్దంటూ వందలాదిమంది సిరియా ప్రజలు నిరసనల బాట పట్టారు. రాజధాని డమాస్కస్లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద గుమిగూడి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు హక్కుల్ని కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటూ డిమాండ్ చేశారు. ‘50 ఏళ్లకు పైగా నియంతృత్వ పాలనలో నలిగిపోయాం. ఇప్పుడైనా మాకు లౌకిక, ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు.
Similar News
News November 17, 2025
చిన్న బ్యాంకుల విలీనానికి కేంద్రం యోచన

ప్రభుత్వరంగ బ్యాంకుల సంఖ్యను కుదించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఇవి 12 ఉండగా 6 లేదా 7కు తగ్గించాలని నిర్ణయించినట్లు ‘ఇన్ఫార్మిస్ట్’ రిపోర్టు పేర్కొంది. చిన్న బ్యాంకులను SBI, PNBలతో అనుసంధానించడం లేదంటే నేరుగా విలీనం చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు వివరించింది. విలీనంతో వాటిని పెద్ద సంస్థలుగా మార్చడం వల్ల స్థిర ప్రణాళికతో లాభాలు ఆర్జించొచ్చని భావిస్తున్నట్లు నివేదించింది.
News November 17, 2025
పశువుల మేతగా.. పంటకు ఎరువుగా ‘అజొల్లా’

‘అజొల్లా’ అనేది పుష్పించని ఆకుపచ్చ ‘ఫెర్న్’జాతికి చెందిన మొక్క. ఇది నీటి మీద తేలుతూ పెరిగే నాచులా ఉంటుంది. ఈ మొక్క పంటసాగులో పచ్చిరొట్టగా, జీవన ఎరువుగా, పశువుల మేతగా ఉపయోగపడుతుంది. రైతులు అజోల్లా సాగు చేపట్టి వారి పొలంలో వేసుకోవడమే కాకుండా పాడి పశువులకు, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలకు దాణాగా అందించవచ్చు. దీని వల్ల అతి తక్కువ ఖర్చులో బహుళ ప్రయోజనాలను పొందవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
News November 17, 2025
అజొల్లాను ఎలా ఉత్పత్తి చేయవచ్చు?(1/2)

చెట్ల నీడలో గోతులు తవ్వి లేదా సిమెంట్ తొట్టెలలో లేదా పోర్టబుల్ కంటైనర్ ఉపయోగించి అజొల్లాను పెంచవచ్చు. గోతులు తవ్వి అజొల్లాను పెంచితే బయటి నుంచి ఎటువంటి వేర్లు లోపలికి రాకుండా ప్లాస్టిక్ సంచులను గోతి లోపల పరచాలి. దాని మీద పాలిథీన్ షీట్ పరిచి నీరు నిల్వ ఉంచే కృత్రిమ తొట్టెలా తయారు చేసుకోవాలి. 10-15 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడ పట్టి మొత్తని మట్టిని షీట్ మీద గోతిలో ఒకే విధంగా ఉండేలా చల్లుకోవాలి.


