News November 11, 2024

బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సూర్య

image

సౌతాఫ్రికాతో రెండో T20లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు కెప్టెన్ సూర్య వెల్లడించారు. 125 స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతమన్నారు. అతను ఈ స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయని, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్‌లో భారత్‌పై SA 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 13, 2024

కోహ్లీని కించపరచడం నా ఉద్దేశం కాదు: పాంటింగ్

image

విరాట్ ఐదేళ్లలో రెండే టెస్టు సెంచరీలు చేశారంటూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ వివరణ ఇచ్చారు. ‘విరాట్‌ను కించపరచడం నా ఉద్దేశం కాదు. AUSతో BGT సమయానికి ఫామ్ అందుకోకపోతే ఇబ్బంది పడతారని చెప్పాను. ఈ విషయంలో కోహ్లీ కూడా నాతో ఏకీభవిస్తారు. తను ఆస్ట్రేలియాలో పుంజుకుంటారని కూడా నేను అన్నాను. కానీ నా మాటలు వక్రీకరించి ప్రచారమయ్యాయి ’ అని వ్యాఖ్యానించారు.

News November 13, 2024

సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులో TWIST

image

రూ.5 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని సల్మాన్‌కు, అతడి కొత్త సినిమాలో పాటల రచయిత సొహైల్ పాషాకు ఇటీవల బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆసక్తికర ట్విస్ట్ వెలుగుచూసింది. బెదిరించింది సదరు రచయితేనని పోలీసులు తేల్చారు. అతణ్ని అదుపులోకి తీసుకున్నారు. తన పాట ఫేమస్ అయ్యేందుకు సల్మాన్‌కు, తనకు బిష్ణోయ్‌ గ్యాంగ్ పేరిట తానే ఆ మెసేజ్ పంపినట్లు నిందితుడు పోలీసుల వద్ద అంగీకరించాడు.

News November 13, 2024

అణు రియాక్టర్లపై రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

image

థర్మల్ ప్లాంట్ల గడువు ముగిసినా, లేదా బొగ్గు సదుపాయం లేని రాష్ట్రాలు అణు విద్యుత్ ప్లాంట్లు ప్రారంభించాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ సూచించారు. కరెంట్‌కు నానాటికీ డిమాండ్ పెరుగుతోందని తాజాగా జరిగిన విద్యుత్ మంత్రుల సదస్సులో గుర్తుచేశారు. దేశంలో 24 అణువిద్యుత్ ప్లాంట్స్ నుంచి 8 గిగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుండగా 2032 కల్లా దాన్ని 20 గి.వాట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.