News November 11, 2024
బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నా: సూర్య

సౌతాఫ్రికాతో రెండో T20లో తమ బౌలర్ల ప్రదర్శన పట్ల గర్వపడుతున్నట్లు కెప్టెన్ సూర్య వెల్లడించారు. 125 స్కోరును డిఫెండ్ చేసుకోవాల్సిన స్థితిలో వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు పడగొట్టడం అద్భుతమన్నారు. అతను ఈ స్టేజీకి రావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఇంకా 2 మ్యాచ్‌లు ఉన్నాయని, చాలా ఎంటర్‌టైన్‌మెంట్ మిగిలే ఉందని వ్యాఖ్యానించారు. నిన్నటి మ్యాచ్‌లో భారత్‌పై SA 3 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
Similar News
News April 16, 2026
కరోండా జీవకంచెతో అనేక లాభాలున్నాయ్

కరోండా ముళ్లతో నిండి ఉండటం వల్ల పశువులు, మేకలు, అడవి పందులు, కుందేళ్లు ఈ కంచెను దాటలేవు. ఈ మొక్క వేర్లు మట్టిని బలంగా పట్టుకుంటాయి. ఫలితంగా ఇవి నేల కోతను, మృత్తికా క్రమక్షయాన్ని తగ్గిస్తాయి. పంటకు అవసరమైన తేమను నిల్వ ఉంచుతాయి. ఈ పొదల్లో పక్షులు గూళ్లు కట్టుకొని రకరకాల పురుగులను తిని పంటకు మేలు చేస్తాయి. తేనెటీగలు ఈ పూలపై తిరుగుతాయి. వీటి వల్ల పొలాల్లో పరాగసంపర్కం జరిగి పంట దిగుబడి పెరుగుతుంది.
News April 16, 2026
APPLY NOW: BECILలో 28 పోస్టులు

కాంట్రాక్ట్ పద్ధతిలో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్-26, పెర్ఫ్యూషనిస్ట్-2 పోస్టుల భర్తీకి బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL) నోటిఫికేషన్ ఇచ్చింది. BSc(MLT), BSc పెర్ఫ్యూషన్ టెక్నాలజీ సర్టిఫికెట్, ఏడాది ఉద్యోగ అనుభవం, 21-40 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేయొచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూతో ఎంపిక ఉంటుంది. దరఖాస్తుకు 27-4-26 చివరి తేదీ. పూర్తి వివరాలకు www.becil.com చూడండి.
News April 16, 2026
క్యాన్సర్‌తో పోరాడుతూనే 96.6% మార్కులు!

ప్రాణాంతక లింఫోబ్లాస్టిక్ లింఫోమా క్యాన్సర్‌తో పోరాడుతూనే చదువులోనూ సత్తా చాటాడు ఢిల్లీకి చెందిన ఆరవ్ వాట్స్. CBSE టెన్త్ ఫలితాల్లో ఏకంగా 96.6% మార్కులు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తీవ్రమైన అనారోగ్యం, కఠినమైన చికిత్సలు తన సంకల్పాన్ని అడ్డుకోలేవని నిరూపించిన ఆరవ్.. నిజమైన యోధుడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చావును జయించి, చదువులోనూ రాణించిన అతని ధైర్యం మనందరికీ ఒక గొప్ప పాఠం.


