News September 6, 2024

మహిళా పక్షపాత పార్టీలో చేరడం గర్వంగా ఉంది: వినేశ్

image

మహిళలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీలో చేరడం తనకు గర్వంగా ఉందని మాజీ రెజ్లర్ వినేశ్ ఫొగట్ పేర్కొన్నారు. బజరంగ్ పునియాతో కలిసి ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకొన్న సంగతి తెలిసిందే. ‘మేం రోడ్లపైకి వచ్చినప్పుడు బీజేపీ తప్ప అన్ని పార్టీలు మాకు మద్దతుగా నిలిచాయి. మా కన్నీళ్లను, బాధను అర్థం చేసుకున్నాయి. బీజేపీ నేతలు మాత్రం మాపై తప్పుడు ప్రచారం వ్యాప్తి చేశారు. కాంగ్రెస్‌కు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

మద్యం దుకాణాల దరఖాస్తులకు నేడే ఆఖరు

image

AP: రాష్ట్రంలో మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. నిన్న రాత్రి వరకు 65,629 దరఖాస్తులు రాగా ప్రభుత్వానికి రూ.1,300 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఇవాళ మరో 20వేల వరకు అప్లికేషన్లు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో 12 చోట్ల షాపులకు ఒక్కోటి చొప్పున, 46 దుకాణాలకు రెండేసి దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం.

News October 11, 2024

రాష్ట్ర పండుగగా వాల్మీకి జయంతి

image

AP: ఈ నెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వేడుకను అనంతపురంలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు ఆయా జిల్లాల్లో అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు.

News October 11, 2024

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ డైరెక్టర్

image

సగటు తెలుగు సినిమా అభిమానులకు దర్శకుడు వి.వి.వినాయక్ పరిచయం అక్కర్లేని పేరు. చిరంజీవి, ఎన్టీఆర్, బాలకృష్ణ వంటి స్టార్లతో ఆయన సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా ఆయన సినిమాలకు దూరమయ్యారు. ఈ క్రమంలో అనారోగ్యం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రభాస్‌తో ఉన్న ఫొటోలో ఆయన గుర్తు పట్టలేనంతగా మారిపోయారు.