News February 4, 2025
1,382 మందికి టీచర్ ఉద్యోగాలు ఇవ్వండి: హైకోర్టు

TG: DSC-2008 బీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరట కలిగించింది. 1,382 మందిని ఈ నెల 10లోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్తో దీనికి సంబంధం లేదని స్పష్టం చేసింది. 2008న ఉమ్మడి ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడింది. ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం డీఈడీ అభ్యర్థులకు కేటాయించింది. తమకంటే తక్కువ అర్హత కలిగినవారికి రిజర్వేషన్ ఇవ్వడంపై బీఈడీ అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.
Similar News
News November 19, 2025
టీవీ ఛానెళ్లకు కేంద్రం హెచ్చరిక

సున్నితమైన, రెచ్చగొట్టే కంటెంట్ ప్రసారంపై TV ఛానెళ్లకు కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఎర్రకోట పేలుడు సహా ఇటీవలి ఘటనలకు సంబంధించిన సమాచార ప్రసారానికి దూరంగా ఉండాలని కోరింది. కొన్ని ఛానెళ్లు హింసను ప్రేరేపించేలా, శాంతికి భంగం కలిగించేలా, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా వీడియోలు టెలికాస్ట్ చేశాయని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని, అలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే దృశ్యాలను ప్రసారం చేయొద్దని సూచించింది.
News November 19, 2025
ఈ నెల 27న రాహుల్ పెళ్లి.. సీఎంకు ఆహ్వానం

స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. ఈ నెల 27న ప్రియురాలు హరిణ్యతో ఆయన వివాహం జరగనుంది. కాబోయే దంపతులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డికి శుభలేఖ అందజేసి ఆహ్వానించారు. ఏపీకి చెందిన టీడీపీ నేత, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్యా రెడ్డి. ఇక రాహుల్ పాడిన ‘నాటు నాటు’ సాంగ్కు ఆస్కార్ దక్కిన విషయం తెలిసిందే.
News November 18, 2025
జైల్లో మొహియుద్దీన్పై దాడి!

టెర్రర్ మాడ్యూల్ కేసులో అరెస్టై అహ్మదాబాద్ సబర్మతీ జైల్లో ఉన్న డా.అహ్మద్ మొహియుద్దీన్పై దాడి జరిగింది. తోటి ఖైదీలు అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడ్డ మొహియుద్దీన్ను పోలీసులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఆముదం గింజల వ్యర్థాలతో ‘రెసిన్’ అనే విషాన్ని తయారు చేసి వేలాది మందిని చంపాలని మొహియుద్దీన్ ప్రయత్నించాడు. ఈక్రమంలోనే HYD రాజేంద్రనగర్లో గుజరాత్ ATS అధికారులు అతడిని అరెస్ట్ చేశారు.


