News May 10, 2024

Proxy: ఒకరి ఓటు వేరేవాళ్లు వేయొచ్చు

image

ఎన్నికల విధుల్లో ఉండే ఆర్మీ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్‌తో పాటు తమ ఓటును వేరే వ్యక్తితో(ప్రాక్సీ) వేయించే సౌకర్యం ఉంటుంది. ఇందుకు 13F ఫారం సమర్పించాలి. ఓటరు డ్యూటీ స్టేషన్‌లో ఉంటే ఆఫీసర్ ఎదుట సంతకం పెట్టి తన ఓటు వేసేందుకు ఎంచుకున్న వ్యక్తికి పంపాలి. అతను నోటరీ లేదా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఎదుట సంతకం పెట్టి ROకు ఇవ్వాలి. ఓటరు హోమ్ టౌన్‌లోనే ఉంటే నోటరీ/మేజిస్ట్రేట్ ముందు సంతకం పెట్టి ROకి పంపాలి.

Similar News

News February 9, 2025

రేపు ఆల్బెండజోల్ మందుల పంపిణీ

image

APలో ఈ నెల 10న జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1-19 ఏళ్లలోపు ఉన్న వారికి ఆల్బెండజోల్-400 మిల్లీ గ్రాముల మాత్రలను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 10న హాజరు కాని వారికి 17వ తేదీన అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 6 నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

News February 9, 2025

NRIలు, NRTS సభ్యులకు శుభవార్త

image

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సభ్యులకు ఇకపై రోజుకు 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను TTD కేటాయించనుంది. అలాగే శ్రీవారి దర్శనం కోసం వచ్చే NRIలు, విదేశీయులకు సుపథం మార్గంలో రూ.300 కోటాలో దర్శనం కల్పించనుంది. స్టాంపింగ్ తేదీ నుంచి నెలలోపు దర్శనం కల్పించనుంది. ఒరిజినల్ పాస్‌పోర్టుతో ఉ.10 నుంచి సా.5 గంటలోపు వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు. బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల టైంలో టోకెన్లు ఇవ్వరు.

News February 9, 2025

GBS కలకలం.. రాష్ట్రంలో తొలి మరణం

image

తెలంగాణలో తొలి GBS(గిలియన్ బార్ సిండ్రోమ్) <<15404745>>మరణం <<>>సంభవించింది. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళ ప్రాణాలు విడిచింది. సిద్దిపేట సమీపంలోని సీతారాంపల్లికి చెందిన వివాహిత(25) నెల రోజుల క్రితం నరాల నొప్పులతో స్థానిక ఆస్పత్రిలో చేరింది. ఆ తర్వాత HYD నిమ్స్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. నిన్న చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

error: Content is protected !!