News April 1, 2025
పిల్లల విషయంలో.. తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచన

ఉద్యోగ జీవితంలో తల్లిదండ్రులు బిజీ అయిపోవడంతో పిల్లలు ఇరువురి ప్రేమకు దూరమైపోతున్నారు. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఒంటిరైపోతున్నారు. కానీ, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. వారితో కలిసి ఒక్కపూటైనా భోజనం చేయాలని, ఏ విషయమైనా మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు ఓ కథ చెప్పడం, రోజులో ఏదో ఒక సమయంలో యాక్టివిటీలో పాల్గొనాలంటున్నారు.
Similar News
News February 26, 2026
భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో కీలక ఒప్పందాలు కుదిరాయి. యూపీఐ చెల్లింపులు, విద్య, వ్యవసాయం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఏఐ, వాణిజ్యం, సైబర్ సెక్యూరిటీ, హెరిటేజ్, సర్వీస్ సెక్టార్లు సహా మొత్తం 27 రంగాలపై మోదీ-నెతన్యాహు సమక్షంలో ఇరుదేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం, ఇండియా-ఇజ్రాయెల్ మధ్య 100 ఎక్స్‌లెన్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
News February 26, 2026
వెస్టిండీస్ స్కోరు ఎంతంటే..

T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 పోరులో వెస్టిండీస్ 176-8 పరుగులు చేసింది. 83కే 7 వికెట్లు కోల్పోయిన దశలో షెఫర్డ్(52*), హోల్డర్(49) ముందుండి నడిపించారు. ఎంగిడి 3, బోష్, రబాడ తలో 2 వికెట్లు తీశారు. సౌతాఫ్రికా టార్గెట్ 177. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిస్తే టీమ్ ఇండియా సెమీస్ అవకాశాలు మెరుగవుతాయి. ఒకవేళ ఓడితే మాత్రం జింబాబ్వే, వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
News February 26, 2026
ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ ఫ్లాట్‌గా ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 27 పాయింట్ల నష్టంతో 82,249 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 25,497 వద్ద సెటిలయ్యాయి. సెన్సెక్స్‌లో BEL, అదానీ పోర్ట్స్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, ఎయిర్టెల్ షేర్లు లాభపడ్డాయి. ట్రెంట్, ఎటర్నల్, పవర్ గ్రిడ్, HDFC బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.


