News April 1, 2025
పిల్లల విషయంలో.. తల్లిదండ్రులకు మానసిక వైద్యుల సూచన

ఉద్యోగ జీవితంలో తల్లిదండ్రులు బిజీ అయిపోవడంతో పిల్లలు ఇరువురి ప్రేమకు దూరమైపోతున్నారు. ఇంట్లో మాట్లాడేందుకు ఎవరూ లేకపోవడంతో ఒంటిరైపోతున్నారు. కానీ, పిల్లలతో మాట్లాడుతూ ఉండాలని మానసిక వైద్యులు చెబుతున్నారు. వారితో కలిసి ఒక్కపూటైనా భోజనం చేయాలని, ఏ విషయమైనా మాట్లాడుతూ ఉండాలని సూచిస్తున్నారు. పడుకునే ముందు ఓ కథ చెప్పడం, రోజులో ఏదో ఒక సమయంలో యాక్టివిటీలో పాల్గొనాలంటున్నారు.
Similar News
News April 17, 2025
జేఈఈ మెయిన్ ఫైనల్ ‘కీ’ విడుదల

జేఈఈ మెయిన్ సెషన్ 2 <
News April 17, 2025
ఆలయాలలోని 1000కేజీల బంగారం కరిగింపు.. ఎక్కడంటే?

తమిళనాడులోని 21దేవాలయాలలో భక్తులు సమర్పించిన 1000 KGల బంగారు ఆభరణాలను కరిగించినట్లు అధికారులు తెలిపారు. వాటిని 24 క్యారెట్ల కడ్డీలుగా మార్చి SBIలో డిపాజిట్ చేసినట్లు వెల్లడించారు. వీటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17.81కోట్ల వడ్డీ రానుండగా, ఆ నిధులతో ఆలయాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. త్వరలోనే ఆలయాలలో నిరుపయోగంగా ఉన్న వెండిని సైతం కరిగించి డిపాజిట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
News April 17, 2025
ALERT: కాసేపట్లో భారీ వర్షం

తెలంగాణలోని కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో రాత్రి 7 గంటల లోపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అటు మహబూబ్‌నగర్, మెదక్, నాగర్‌కర్నూల్, నారాయణపేట్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనూ పిడుగులతో కూడిన మోస్తరు వాన పడుతుందని ఇప్పటికే అంచనా వేసింది. ప్రజలు ఎత్తైన ప్రదేశాలు, చెట్ల కింద ఉండొద్దని హెచ్చరించింది. కాగా ఆదిలాబాద్ జిల్లాలో సాయంత్రం వడగళ్ల వాన కురిసింది.